English | Telugu
శేఖర్ చంద్ర ఎన్నో ఢక్కామొక్కీలు తిని పైకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
Updated : Dec 1, 2025
పాడుతా తీయగా షో ఈ వారం ఎపిసోడ్స్ మంచి హుషారుగా సాగాయి. ఇక ఈ షోకి ఎనర్జిటిక్ హోస్ట్ సుమ గెస్ట్ గా వచ్చింది. ఇందులో ఆమె తనదైన శైలిలో కామెంట్స్ తో కంటెస్టెంట్స్ ని హుషారెత్తించింది. ఐతే ఇందులో కీరవాణి కూడా కంటెస్టెంట్స్ కి చాలా సజెషన్స్ ఇచ్చారు. ఇక "హరి అనుమోలు అనే ఒక ఫేమస్ డి.ఓ.పి ఉన్నారు. ఆయన ఒక రోజు వాళ్ళ అబ్బాయి శేఖర్ చంద్రని తీసుకొచ్చి మీ వెనక తిప్పుకోండి మ్యూజిక్ అంటే ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు అన్నారు. నేను కూడా నాతో తిరిగాడు. కీ బోర్డు నేర్చుకున్నాడు. నాతో తిరిగితే పెద్దగా ఏమీ పట్టుబడదు . నువ్వొక పని చెయ్యి మద్రాస్ వెళ్ళిపో అక్కడ నీకు ఎవరు తెలియకపోయినా సరే అలాగే స్ట్రగుల్ అవ్వు.
నువ్వు రోడ్ల మీద తిరుగుతావో, ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వెళ్లి ప్రాధేయపడతావో తెలీదు. నీ సొంతంగా నువ్వే చూసుకో అని చెప్పా. ఈత రాని వాడిని సముద్రంలో తోసేస్తే ఈత వచ్చేస్తుంది చూడు అలాగే నువ్వు అలా వెళ్ళిపో అన్నాను. నా మాట తూచ తప్పకుండ పాటించాడు అలా వెళ్ళిపోయాడు. తర్వాత నేను బాలు గారి థియేటర్ లో కోదండపాణి ఆడియో ల్యాబ్ లో ఒకసారి ఏదో రికార్డింగ్ చేస్తుంటే అక్కడ కనిపించాడు. అది కూడా రెండేళ్ల తర్వాత. ఎం శేఖర్ బాగున్నావా అంటే బాగున్నాను అన్నాడు. నేను ఢక్కామొక్కీలు తిని అందరినీ పరిచయం చేసుకున్నాను. మీరు చెప్పినట్టే చేసాను నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత కట్ చేస్తే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు చాల మంచి హిట్స్ ఇచ్చాడు. సో శేఖర్ చంద్రను చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రికమండేషన్ లు కానీ ఎవరో ఏదో చేస్తారు అని ఎవరో సపోర్ట్ చేస్తారు అని అనుకోకుండా నీ శక్తిని నమ్ముకుంటూ అట్లాగ స్వయంకృషితో వెళ్ళిపోవాలి ముందుకు. ఎవరి కోసం ఆగకుండా వెళ్తే కాలం అదే మీకు సహాయం చేసి రూట్ ఏర్పాటు చేస్తుంది అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర ఒకరు" అంటూ చెప్పుకొచ్చారు.