English | Telugu
Suman Shetty: సుమన్ శెట్టి వల్లే డబుల్ ఎలిమినేషన్ చేయలేదా.. బిగ్ ట్విస్ట్!
Updated : Dec 1, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండో వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అన్నారు. కానీ లాస్ట్ మినిట్ లో దివ్యని సింగిల్ ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. దాని వెనుక ఉన్న అసలు కారణం సుమన్ శెట్టి.
పదకొండు వారాలుగా హౌస్ లో ఏం చేయకపోయినా.. నామినేషన్లో ఉన్నా సేవ్ అవుతూ వస్తున్న సుమన్ శెట్టిని చూసి అందరికి అర్థం అయింది ఒక్కటే.. సుమన్ శెట్టిని ఎన్ని వారాలు కాపాడాలో అన్ని వారాలు కాపాడుకుంటూ వస్తున్నాడు బిగ్ బాస్. గతవారం సంజన, సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉంటే ఎలిమినేషన్ రౌండ్ ని సంజన, దివ్యల మధ్య పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ వారం సుమన్ శెట్టి లీస్ట్ ఓటింగ్ తో ఉన్నా దివ్యని ఎలిమినేషన్ చేశారు. అయితే ఇప్పుడున్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లో వీక్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అది సంజన, సుమన్ శెట్టి అంతే. అయితే సుమన్ శెట్టికి చాలా ఓట్ బ్యాకింగ్ ఉంది. తనకు ఫాలోవర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ వార్ కూడా జరుగుతుంది. అందుకే మనం ఇప్పట్లో అతడిని పంపించొద్దని బిగ్ బాస్ ఆలోచించి అతడిని తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరిని ఎలిమినేట్ చేస్తున్నాడు.
సుమన్ శెట్టి వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినటువంటి దివ్య ఎలిమినేట్ అయింది. అంతకముందు నిఖిల్ కూడా సుమన్ శెట్టి నామినేషన్ వల్ల బయటకు వచ్చాడు. అసలు నిఖిల్ అండ్ సుమన్ శెట్టికి టాస్క్ పెడితే ఎవరు గెలుస్తారు. అలాంటి ఒక ప్లేయర్ బయటకు వచ్చాడంటే ఇది కచ్చితంగా బిగ్ బాస్ మామ జిమ్మిక్కు అంటే తనూజ, సుమన్ శెట్టి ఇద్దరిని ఎంత కాపాడాలో అంతా కాపడుతున్నాడు. పన్నెండో వారం హౌస్ లో తొమ్మిది మంది ఉన్నారు.. పదకొండో వారం ఎలిమినేషన్ జరుగలేదు.. ఫినాలేకి ఇంకా మూడు వారాలే మిగిలి ఉంది.. ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండాలి.. కానీ లీస్ట్ లో సుమన్ శెట్టి, సంజన, దివ్య ఉన్నారు. దివ్యకి ఎలాగు నెగెటివ్ ఉంది కాబట్టి తనని ఎలిమినేట్ చేద్దాం.. సుమన్ శెట్టిని బయటకు రాకుండా ఆపాలంటే డబుల్ ఎలిమినేషన్ ఉండకూడదని అలా సింగిల్ ఎలిమినేషన్ చేశాడంటూ బిగ్ బాస్ పై ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి. మరి డబుల్ ఎలిమినేషన్ జరగకుండా ఉండటానికి కారణమేంటో మీరే కామెంట్ చేయండి.