English | Telugu
పంచదారలాంటి ప్రోగ్రాం పాడుతా తీయగా అన్న కీరవాణి
Updated : Jun 7, 2022
పాడుతా తీయగా షో గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఈ షోకి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎస్పీ చరణ్ హోస్టింగ్ కోసం ఈ షోని ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. దేశవిదేశాల్లో కూడా ఈ షోని చూసే అభిమానులు చాలామంది ఉన్నారు. ఐతే ఇప్పుడు లేటెస్ట్ ఈ పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలేలోకి ఎంటరయ్యింది. ఈ ప్రోగ్రాం జూన్ 12 ఈటీవీలో ప్రసారం కానుంది.. ఈ షోకి కీరవాణి గారు వచ్చారు. ఆయన ఎంట్రీతో ఈ గ్రాండ్ ఫినాలే స్టేజి ఒక్కసారిగా మెరిసిపోయింది.
కీరవాణి గారికి చిన్నప్పటినుంచి కూడా పాలల్లో పంచదార వేసి బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ వేసుకుని తాగడమంటే చాలా ఇష్టమట. ఐతే పాలన్నీ తాగేసాక ఆఖరిలో కాస్త చక్కర మిగిలిపోతుంది కదా.. దాన్ని స్పూన్ తో తీసుకుని తినడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలే అనేది ఆ పంచదార లాంటిది అంటూ పోల్చారు కీరవాణి గారు. ఇక ఈ షోలో మరింత రుచిని అందరం చూడబోతున్నాం అని చెప్పారు. ఈ పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలే ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ లాస్ట్ సంచికలో కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవాలంటే 12 వరకు ఆగాల్సిందే.