English | Telugu
రాజ్ పై కావ్య చూపిస్తున్న కేరింగ్.. స్వప్నకి అవమానం!
Updated : Jul 12, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -145 లో... కావ్య కోసం అకౌంట్ ఓపెన్ చెప్పిద్దామంటే ఈ తింగరిది ఇక్కడ లేదని రాజ్ కావ్య కోసం అటు ఇటు చూస్తుంటాడు. రాజ్ అలా చూడడం గమనించిన ధాన్యలక్ష్మి.. రాజ్ ఎవరికోసం చూస్తున్నావ్? కావ్య కోసమేనా నేను పిలుచుకొస్తాను ఉండు అని ధాన్యలక్ష్మి వెళ్తుంది.
ఆ తర్వాత అందరి అకౌంట్ ఓపెన్ చెయ్యడం అయింది సర్ ఇంకొక ఫామ్ ఉంది.. ఎవరికి ఓపెన్ చెయ్యమంటారని బ్యాంకు నుంచి వచ్చిన అతను రాజ్ ని అడుగుతాడు. అప్పుడే పై నుండి స్వప్న, కావ్య ఇద్దరు వస్తారు. ఇంక ఇద్దరు ఉన్నారు ఫామ్ ఒకటే ఉందని అందరూ ఆలోచిస్తుండగా.. ఎందుకు ఆలోచించడం మా అక్కకి ఓపెన్ చెయ్యండి అని కావ్య అంటుంది. స్వప్నకి అవసరం అయితే రాహుల్ వెళ్లి ఓపెన్ చేపిస్తాడు కానీ కావ్యకి ఓపెన్ చెయ్యండని ధాన్యలక్షి అంటుంది. అందరూ షాక్ అవుతారు. రాజ్ కావ్య కోసం ఇదంతా చేస్తుంటే స్వప్న కి అంటున్నారు.. కావ్యకి ఓపెన్ చెయ్యండని ధాన్యలక్ష్మి అంటుంది. వివరాలు చెప్పమని కావ్యని రాజ్ అంటాడు. ఆ తర్వాత స్వప్న కోపంగా తన గదిలోకి వెళ్లి నాకు అవమానం జరిగిందంటూ రాహుల్ పై కోప్పడుతుంది.
నీ కోపం నాపై కాదు కావ్య నీ చెల్లెలు కదా.. నువ్వు ముందు తనని నీ కంట్రోల్ లో ఉంచుకో.. ఆ తర్వాత అందరూ నీ కంట్రోల్ లొకి వస్తారని రాహుల్ చెప్తాడు. మరొక వైపు కావ్య రాజ్ వెళ్లే కార్ లో ఇన్ హెల్లర్ పెడుతుంది. అప్పుడే రాజ్ వచ్చి ఏం చేస్తున్నావని కావ్యని అడుగుతాడు. మీకు ఇన్ హెల్లర్ అందుబాటులో లేకపోవడం వళ్లే మొన్న అలా జరిగింది. అందుకే కార్ లో ఒకటి పెట్టాను ఇంకొకటి మీరు మీ క్యాబిన్ లో పెట్టండని కావ్య చెప్పగానే.. రాజ్ సైలెంట్ గా వెళ్ళిపోతాడు.ఆ తర్వాత కావ్య దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటానని కావ్య అనగా.. నేను నేర్పుతానని కళ్యాణ్ అంటాడు. మరొక వైపు రాజ్ పట్ల కావ్య కేరింగ్ చూపించడం తో రాజ్ ఇన్ హెల్లర్ ల వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
మరొక వైపు స్వప్న కిచెన్ లో వంట చెయ్యడానికి రెడీ చేస్తూ ఉంటే.. ధాన్యలక్ష్మి వచ్చి నువ్వు కిచెన్ లోకి ఎందుకు వచ్చావ్? ఏదైనా ఉంటే కావ్య చేసి పెడుతుంది కదా అని స్వప్నతో ధాన్యలక్ష్మి అంటుంది. ఏంటి ఆ కావ్య ఏమైనా ఇంటికి మహారాణా? అన్ని తననే అడగాలా అని కోపంగా స్వప్న రుద్రాణి దగ్గరికి వెళ్తుంది. ఇంకా కావాలనే రుద్రాణి స్వప్నని రెచ్చగొడుతుంది. ఎలాగైనా ఇంట్లో అందరూ నా మాట వినేలా చేసుకుంటా అని స్వప్న అనుకుంటుంది. మరొక వైపు కావ్యకి కళ్యాణ్ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. శృతి డిజైన్స్ లు తీసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగల్సిందే.