English | Telugu
సినిమా ఫీల్డే నీ అడ్డా..ఇంకా సుమ అడ్డా అనే పేరు ఎందుకు పెట్టావో తెలీదు
Updated : Jul 11, 2023
సుమ అడ్డా షో ఈ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ కి సునీత కొడుకు ఆకాష్ నటించిన "సర్కారు నౌకరి" మూవీ టీం వచ్చింది. సునీత, ఆకాష్, రాఘవేంద్రరావు వచ్చారు.. "తెలుగు జాతి గర్వించే దర్శకేంద్రుడు" అంటూ ఇన్వైట్ చేసింది సుమ. "నా క్యాష్ ప్రోగ్రాంకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు సుమ అడ్డా షోకి వచ్చారు..ధన్యోస్మి" అని సుమ అనేసరికి "సినిమా ఫీల్డే నీ అడ్డా..ఇంకా సుమ అడ్డా అనే పేరు ఎందుకు పెట్టావో నాకు తెలీదు" అన్నారు రాఘవేంద్రరావు. దానికి అందరూ నవ్వేశారు. రెండు "సు" లతో సునీత, సుమ..ఒకరు వాగుడుకాయ్, ఒకరు పాటకాయ్ అన్నారు. ఇక సునీత వాళ్ళ అబ్బాయి గురించి సుమ కామెంట్ చేసింది. "చేతుల్లో పసి బిడ్డగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ స్టేజి వరకు ఎదిగాడు కానీ నేనే ఎందుకో అలాగే ఉండిపోయాను అనిపిస్తోంది" అంది సుమ.
తర్వాత "సిరిమల్లె సిరిమల్లె పువ్వా" అనే సాంగ్ కి సుమ చంద్రమోహన్ ల నటిస్తే సునీత శ్రీదేవిలా నటించారు. తర్వాత ఆకాష్ సుమ డబ్బులు ఇచ్చేసరికి "చూడు సునీత మీ అబ్బాయి నేను అడుక్కుంటున్నాననుకుంటున్నాడు" అనేసరికి కాదు అని చేతులూపాడు ఆకాష్ ...తర్వాత హీరో హీరోయిన్స్ ఆకాష్, భావన పారిపోతుంటే సునీత వాళ్ళను ఆపి "ఎందుకు ప్రేమించావు, ఎలా ప్రేమించావు, ఎక్కడ కలిశారు, అసలు ఏం జరుగుతోంది" అని సునీత సీరియస్ గా అడిగేసరికి "నువ్వు అడిగే నాలుగు ప్రశ్నలకు సమాధానం ఒక్కటే అది ఈవిడే" అని సుమని చూపించేసరికి సుమ షాకైపోయింది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో హీరో సైకిల్ మీద కనిపిస్తుంది అలాగే బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్టుకి ఓ డబ్బా వేలాడటం, దానిపై 'పెద్ద రోగం చిన్న ఉపాయం' అని రాసి ఉండటం, అందులోనూ ఈ వెరైటీ లుక్ తో అసలు ఈ స్టోరీ ఏమిటి అనే ఒక ఆసక్తి నెలకొంది. అందులోనూ కొత్త హీరోగా ఆకాష్ ఇందులో చాలా నాచురల్ గా కనిపించాడు. మరి ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని ప్రొమోషన్స్ బాట పట్టింది.