English | Telugu

కావ్య కాంట్రాక్ట్ పూర్తిచేయగలదా.. ఆ రౌడీలు ఏం చేయనున్నారు?


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -207 లో.. కావ్యని తీసుకొని వెళ్ళడానికి రాజ్ తన అత్తింటికి వస్తాడు. రాజ్ రావడం చూసిన కావ్య.. మీరు వచ్చారా నేను రావడం లేట్ అవుతుందని తాతయ్యకు చెప్పానని కావ్య అనగానే.. లేట్ అవుతుందనే నేను నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చానని రాజ్ అంటాడు. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తిలు రాజ్ నీ ఇంట్లోకి పిలుస్తారు. ఆ తర్వాత కావ్య బొమ్మలకు కలర్స్ వేస్తుంటే కావ్య దగ్గరే రాజ్ కూర్చొని ఉంటాడు. కృష్ణమూర్తి విగ్రహల దగ్గరికి వెళ్తున్నానని వెళ్తాడు.

రాహుల్ పంపిన రౌడీలు విగ్రహలు తీసుకొని వెళ్ళడానికి వస్తారు.‌ మరొక వైపు కృష్ణమూర్తి ఇంకొక అబ్బాయి విగ్రహల దగ్గరే ఉంటారు. మరొక వైపు కావ్య కలర్స్ వేస్తుంటే కావ్యనే చూస్తుంటాడు‌ రాజ్. ఆ తర్వాత ఈ రోజు మీరు ఇక్కడే ఉంటారా కాంట్రాక్టు పూర్తి అవుతుంది. రేపు మీతో గుమ్మడి కాయ కొట్టించాలని మా వాళ్ళు అనుకుంటున్నారు. కాంట్రాక్టు మీ వల్లే వచ్చింది కాబట్టి మా వాళ్ళు హ్యాపీగా ఉంటారని రాజ్ తో కావ్య అనగానే.. సరే అని రాజ్ అంటాడు. మరొక వైపు దుగ్గిరాల ఇంట్లో.. మీరు కావ్య ఏం చెప్తే అది చెయ్యకండి. ప్రతిసారీ పుట్టింటికి వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారని సీతారామయ్యతో అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత సీతరామయ్య రాజ్ కి ఫోన్ చేస్తాడు. కాసేపు మాట్లాడిన రాజ్.. ఈ రోజు ఇంటికి రావడం లేదని చెప్పగా.. సరేనని సీతారామయ్య చెప్తాడు. అపర్ణ కూడా రాజ్ మాటలు వింటుంది.

ఆ మాటలు విన్న అపర్ణ.. రాజ్ అక్కడికి వెళ్తే వాడిని మార్చేస్తారని అనుకుంటుంది. ఆ తర్వాత రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేసి.. ప్లాన్ ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతుంది.‌ మరొకవైపు కావ్య, కనకం, అన్నపూర్ణ, అప్పు అందరు కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్ని కూడా రాజ్ వింటాడు. ఆ తర్వాత పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ సంతోషంగా ఉంటారు. కృష్ణమూర్తి చేసిన విగ్రహాల దగ్గరికి రాహుల్ పంపిన రౌడీలు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.