English | Telugu

Brahmamudi : రౌడీల నుండి రాజ్, కావ్య తప్పించుకుంటారా..‌రాహుల్ ప్లాన్ అదేనా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -901 లో....రాహుల్ దగ్గరికి స్వప్న రొమాంటిక్ గా వస్తుంది. తనని చూసి ఏంటి స్వప్న ఇంత అందంగా ఉన్నవని పొగుడుతాడు.స్వప్నని రాహుల్ హగ్ చేసుకొని.. సడెన్ గా అయ్యో సారీ స్వప్న నేను టెన్షన్ లో ఉన్నాను అంటాడు. ఏమైందని స్వప్న అడుగుతుంది. నువ్వు డిజైన్స్ సెలెక్ట్ చేసావ్ కదా ఆ డిజైన్ కి ప్రమోషన్ ఇప్పించాలి కదా వాటికోసం మోడల్స్ కోట్లలో అడుగుతున్నారు. ఇప్పుడే మనం అంత ఇచ్చుకోలేం కదా అని రాహుల్ అంటాడు. స్వప్న నువ్వు ఒకప్పుడు మోడల్ వే కదా ప్లీజ్ ఇప్పుడు ఈ డిజైన్స్ కీ మోడల్ గా నువ్వు చెయ్యొచ్చు కదా అని రిక్వెస్ట్ చెయ్యడంతో స్వప్న సరే అంటుంది.

మరొక వైపు రాజ్, కావ్య హోటల్ లో ఉండగా.. అక్కడ రాజ్ కి తెలిసిన ఇన్‌స్పెక్టర్ కలిస్తే మాట్లాడుతాడు. అప్పుడే రూమ్ సర్వీస్ అతనికి రాజ్ రూమ్ లో పెన్ డ్రైవ్ దొరుకుతుంది. అది బేరర్ కి ఇచ్చి ఆ టేబుల్ మీద ఉన్న వాళ్లకు ఇవ్వమని చెప్తాడు. అతను వెళ్ళేలోపు రాజ్, కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బేరర్ అక్కడున్న ఇన్‌స్పెక్టర్ కి ఇస్తాడు. మీ రూమ్ లో ఇది దొరికింది అని ఇస్తాడు. ఓహ్ రాజ్ వాళ్ళది అయి ఉంటుందని రాజ్ వెనకాలే ఇన్‌స్పెక్టర్ వెళ్తారు. అప్పుడే రాజ్, కావ్యకి మత్తు ఇచ్చి చోటు, మోటు ఇద్దరు కిడ్నాప్ చేస్తారు. అది ఇన్‌స్పెక్టర్ చూసి వాళ్ళని ఇక్కడ కిడ్నాప్ చెయ్యాల్సిన అవసరం ఎవరికి ఉంది. ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చూడాలని ఇన్‌స్పెక్టర్ అనుకుంటాడు. మరొకవైపు రాహుల్, స్వప్నని ఫోటో షూటింగ్ కీ తీసుకొని వస్తాడు. కెమెరా మెన్ తనని చూసి.. రాహుల్ నీ భార్య చాలా బాగుందంటూ పొగుడుతాడు.

స్వప్నకి జ్యువెలరీ వేసి డిజైన్స్ ఫోటో షూటింగ్ జరిపిస్తాడు రాహుల్. ఆ తర్వాత రాజ్, కావ్యని తాళ్లతో కట్టి బంధిస్తారు. పెన్ డ్రైవ్ ఎక్కడ అని చోటు, మోటు వాళ్ళని అడుగుతారు. మాకేం తెలియదని రాజ్ అంటాడు. మరొకవైపు రాజ్ కంపెనీ క్లయింట్స్ ని రాహుల్ రప్పించుకొని డిజైన్స్ ప్రమోషన్ గురించి చెప్పగానే వాళ్ళు రాహుల్ వైపు తిరుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.