English | Telugu

కార్తీకదీపం vs ఐపిఎల్... రిమోట్ దొరకడం కష్టమే!

సినిమాలకే కాదండి సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ ఉంటాయి. ఇప్పుడు అలాగే కార్తీక దీపం సీరియల్ కి సీక్వెల్ వచ్చేస్తోంది. ‘కార్తీక దీపం ఇది నవవసంతం’ అంటూ సీక్వెల్ టైటిల్ కూడా రివీల్ చేశారు. ఐతే రీసెంట్ గా రిలీజ్ చేసిన సెకండ్ పార్ట్ ప్రోమో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. తెలుగు లోగిళ్లు మరువని కథ కొత్త వెలుగులతో మళ్లీ వస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సీరియల్ సృష్టించిన రికార్డు ఇంకే సీరియల్ కూడా సృష్టించలేకపోయింది.

ఒకప్పుడు దూరదర్శన్ లో అద్భుతమైన లవ్ స్టోరీ ఋతురాగాలు కోసం లేడీస్, జెంట్స్, కాలేజీ స్టూడెంట్స్ అంతా వెయిట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సీరియల్స్ చరిత్రలో గుర్తు పెట్టుకునే మరో సీరియల్ గా కార్తీక దీపం నిలిచింది. ఇందులో దీప అలియాస్ వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ కనిపించింది. ఆమె నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సీరియల్ ద్వారా ప్రేమీ విశ్వనాథ్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. డాక్టర్ బాబుగా నిరుపమ్ పాత్ర గురించి చెప్పక్కర్లేదు. మొత్తం ఆరేళ్లపాటు సుమారు 1559 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తెలుగులో అత్యధిక టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్న సీరియల్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సీరియల్ కు సీక్వెల్ మళ్లీ రాబోతుంది. ఐతే ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోందో డేట్ ఇవ్వలేదు. కానీ వచ్చే నెల నుంచి ఐపిఎల్ షెడ్యూల్ ఇచ్చేసింది. దీంతో కార్తీక దీపం వెర్సెస్ ఐపీఎల్ అంటూ ట్రోల్ల్స్ మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగు ఆడియన్స్ అంతా "హమ్మయ్యా చివరికి కార్తీక దీపం అప్ డేట్ వచ్చింది" అనుకుంటూ ఉంటే, "ఇక రిమోట్ దొరకడం అంటూ తీవ్ర ఆందోళనకు గురవుతున్న ఐపిఎల్ యూత్"..అనే మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. "ఒక రోజు నేను టీవీలో సీరియల్స్ చూస్తా..నువ్వు ఓటిటిలో కార్తీక దీపం చూడు. ఇంకో రోజు నేను ఓటిటిలో క్రికెట్ చూస్తా నువ్వు టీవీలో కార్తీక దీపం చూడు" అంటూ తల్లి పిల్లల మధ్య మాటలు బాగా పేలాయి.