English | Telugu

జ్యోత్స్నని చితకబాదిన పారిజాతం.. సంతోషంలో శివన్నారాయణ కుటుంబం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -468 లో.....దీపని క్షమించు అత్త అని సుమిత్రతో కార్తీక్ అంటాడు. మావయ్య మీరు అత్తని క్షమించండి.. ఎందుకు మనకి గొడవలు.. ముందులా మనం సంతోషంగా ఉండలేమా అని దశరథ్ తో కార్తీక్ అంటాడు. నేను దీపని క్షమించాలంటే మీ మావయ్య నన్ను క్షమించాలని సుమిత్ర అంటుంది.

నేను కాదు క్షమించల్సింది నా చెల్లి అని దశరథ్ అంటాడు. నా కోడలిని క్షమిస్తే నేను నిన్ను క్షమించినట్లేనని కాంచన అంటుంది. సరే నేను దీపని క్షమిస్తానని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. రేపు నేనొక నిర్ణయం తీసుకోబోతున్నాను.. అందరు మా ఇంటికి రండి.. విందు రెడీ చేస్తానని సుమిత్ర అందరిని ఆహ్వానిస్తుంది. సుమిత్ర వెళ్తు అందరికి చెప్తుంది. దీపకి కూడా చెప్తుంది. దాంతో దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోత్స్న డిస్సపాయింట్ అవుతుంది. నేను కూడా మీ కుటుంబంలో ఒకవాడిని అని మర్చిపోకండి అని కాంచన వాళ్ళతో శ్రీధర్ అంటాడు. శివన్నారాయణ, దశరథ్ జరిగింది గుర్తుచేసుకొని సంతోషంగా మాట్లాడుకుంటారు. చాలా రోజులకి మీరు సంతోషంగా ఉన్నారు నాన్న అని శివన్నారాయణతో దశరథ్ అంటాడు.

మరొకవైపు శ్రీధర్ కి డ్రింక్ తీసుకొని వస్తుంది కావేరి. కార్తీక్ ప్రాణధాత దీప అని తెలిసి స్వప్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని శ్రీధర్ తో కావేరి అంటుంది. నా కొడుకు ప్రాణాలు కాపాడింది కోడలా.. తనకి నేను ఎప్పటికీ బుణపడి ఉంటాను. మిమ్మల్ని ఆ కుటుంబానికి దగ్గర చెయ్యమని దీపని అడగాలనుకుంటున్నానని శ్రీధర్ అనగానే కావేరి సంతోషపడుతుంది. అదంతా స్వప్న విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. ఏంటి గ్రానీ నాకు సపోర్ట్ చేయకుండా దీపకి చేస్తున్నావని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది. కాశీ గాడి గురించి నాకు ఎందుకు చెప్పలేదని జ్యోత్స్నని కొట్టిన చోట కొట్టకుండా బాదుతుంది పారిజాతం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..