English | Telugu
Karthika Deepam2 : శౌర్య పాప ఇంట్లోనే ఉంది.. ఇదంతా వాడి పనే!
Updated : Jun 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -62 లో.. శౌర్య కోసం దీప అంతటా వెతుకుతుంది. ఎవరు చూడలేదని చెప్తారు. మరొకవైపు కార్తీక్ కూడా వెతకుతాడు. ఎక్కడైనా కన్పించిందా అని కార్తీక్ ని దీప అడుగుతుంది. నా బిడ్డకు ఏం కాదు కదా.. కన్పిస్తుంది కదా అని దీప ఎమోషనల్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కార్తీక్ అనగానే.. వద్దు ఇప్పటికే నేను ఒక సాక్షిగా ఉన్నాను.. మళ్ళీ పోలీసులు అంటే ఇదొక డ్రామానా అని అంటారని దీప అనగానే సరే మనమే వెతుకుదామని కార్తీక్ అంటాడు.
మరొకవైపు ఎందుకు రెండు రోజుల నుండి మీరు తేడాగా ఉన్నారని శ్రీధర్ ని కాంచన అడుగుతుంది. ఏమైంది నాతో ఏదైనా చెప్పాలా అని కాంచన అనగానే.. చెప్తే నువ్వు తట్టుకోలేవని శ్రీధర్ అనుకుంటాడు. నేను వారం రోజులు బయటకు వెళ్తాను.. నువ్వు మీ అన్నయ్య వాళ్ళింట్లో ఉండమని శ్రీధర్ అనగానే.. మీరు ఎక్కడికి వెళ్తున్నారని కాంచన అడుగుతుంది. కావేరిని నా కూతురిని తీసుకొని బయటకు వెళ్ళాలి.. అది చెప్పలేనని శ్రీధర్ మనసులో అనుకొని.. ఎక్కడికి వెళ్లట్లేదు ఎక్కడికైనా వెళ్తే దిగులు పడకని చెప్తున్నానని శ్రీధర్ అనగానే.. దిగులు ఎందుకు ఉండదని కాంచన అంటుంది..మరొకవైపు దీప, కార్తీక్, జ్యోత్స్న లు శౌర్యని వెతుకుంటూ ఉంటారు.. దీప ఏడుస్తుంటే కార్తీక్ చూడలేకపోతాడు. అప్పుడే జ్యోత్స్నకు పారిజాతం ఫోన్ చేస్తుంది. శౌర్య కన్పించడం లేదని వెతుకుతున్నామని జ్యోత్స్న చెప్పగానే.. శౌర్య ఇక్కడే ఉంది కదా అని ఫోటో తీసి పంపిస్తుంది. శౌర్యా ఇంట్లోనే ఉందట అని ఆ ఫోటోని కార్తీక్, దీపలకి చూపిస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత అందరు ఇంటికి వెళ్తారు.. శౌర్యని హగ్ చేసుకొని దీప ఎమోషనల్ అవుతుంది. అప్పుడే కార్తీక్ కు నర్సింహా ఫోన్ చేసి.. దీపకు ఇవ్వమని అంటాడు. ఇవ్వనని కార్తీక్ అనగానే.. ఇంటికి వచ్చి గొడవ చేస్తానని నర్సింహ అనగానే.. దీపకు ఫోన్ ఇస్తాడు కార్తిక్. నీ కూతురు దొరికిందా.. నా ఫ్రెండ్ క్యాబ్ డ్రైవర్.. నేనే అందరిని దింపాకా లాస్ట్ కు దించమన్నాను. నిన్ను టెన్షన్ పెట్టాలని.. ఇక నుండి నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వనని నర్సింహ అంటాడు. దాంతో దీప కోపంగా.. మీరు పాప దగ్గర ఉండండి. నేను మళ్ళీ వస్తానంటు కార్తీక్ కు చెప్పి వెళ్తుంది.
అదంతా చూస్తున్న జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత పారిజాతం లోపలకు వెళ్లి.. అసలేం జరిగిందని అడుగుతుంది. నేనే దీప కనిపిస్తే ఆపమని చెప్పానని జ్యోత్స్న అనగానే పారిజాతం తిడుతుంది.ఇదంతా మీ అమ్మ వళ్లే అని పారిజాతం అనగానే.. అప్పుడే సుమిత్ర వచ్చి అత్తయ్య అంటూ కోపంగా అరుస్తుంది. ఆ తర్వాత సుమిత్రకు జ్యోత్స్న జరిగిందంతా చెప్తుంది. ఎప్పుడు బావ, నేను కలిసి వెళ్లిన వాళ్ళ ద్వారా ఏదో ఒక డిస్టబ్ అని సుమిత్రకి జ్యోత్స్న చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.