English | Telugu

Karthika Deepam2 : అల్లుడికి అంత సీన్ లేదని పారిజాతం...కావేరి గురించి తెలుసుకోగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -58 లో.....శ్రీధర్ వెళ్తుంటే దీప భర్త నర్సింహ రెండో పెళ్లి విషయం గురించి కూడా లాయర్ కి చెప్పమని పారిజాతం అంటుంది. మన టెన్షన్స్ మనకి ఉండగా.. ఎందుకు వాళ్ళ గురించి అని శ్రీధర్ అంటాడు. అలా అంటావేంటి? అలా భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవచ్చా అని పారిజాతం అనగానే.. ఈవిడ మళ్ళీ మొదలు పెట్టిందని శ్రీధర్ కంగారుగా వెళ్తాడు. ఎంటి అల్లుడు రెండో పెళ్లి అనగానే టెన్షన్ పడుతున్నాడు.. డౌట్ పడదామన్న కూడా అల్లుడికి అంత సీన్ లేదని పారిజాతం అనుకుంటుంది.

ఆ తర్వాత నరసింహ అన్న మాటలు దీప గుర్తుకుచేసుకుంటుంది. మరొకవైపు నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటానని నర్సింహ హోటల్ కి వస్తాడు. వీడిని త్వరగా ఇక్కడ నుండి పంపించాలని కడియం అనుకుంటాడు. నాకు ఒక టీ తీసుకొని రా అని నరసింహ కడియానికి చెప్తాడు. మరొకవైపు శౌర్య స్కూల్ నుండి.‌. " స్కూల్ లో ప్రోగ్రామ్ ఉంది " అని కార్తిక్ కి మెసేజ్ వస్తుంది. అది చూసి ఈ విషయం దీపకి చెప్పలని కార్తీక్ హోటల్ కి వెళ్తాడు. కార్తీక్ కి వెళ్లేసరికి నరసింహ హోటల్ లో గొడవ చేస్తుంటాడు. పోలీస్ స్టేషన్ లో పెట్టినా వీడికి బుద్ది రాలేదా అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత శౌర్యాస్కూల్ లో చదవడం.. నువ్వు ఇక్కడ పని చెయ్యడం నాకు ఇష్టం లేదని నర్సింహ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ కడియానికి ఫోన్ చేసి.. నేను నీ ఎదురుగా ఉన్నాను.. నేను చెప్పినట్టు చెయ్ అని చెప్తాడు. ఆ తర్వాత నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని నర్సింహతో కడియం అంటాడు. ఏంటి రా అని కడియం పై నరసింహ చెయ్ ఎత్తుతాడు కానీ నర్సింహ కొట్టకముందే కడియం కిందపడిపోతాడు. అందరు వస్తారు.. దీపమ్మని ఏడిపిస్తున్నాడు నన్ను కొట్టాడని కడియం అనగానే.. అందరూ నర్సింహని తిడతారు. నువ్వు ఇలా ఆడపిల్లని ఏడిపిస్తున్నావని షీ టీమ్ కి కాల్ చేస్తామని వాళ్ళంతా అనగానే నర్సింహ అక్కడ నుండి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు. శౌర్యా గురించి చెప్పి వెళ్ళిపోతాడు. నీకు అంత ధైర్యం లేదు కదా .. ఎలా నర్సింహకు ఎదరు తిరిగావని దీప అడుగగా.. కార్తీక్ పేరు చెప్పకుండా కడియం కవర్ చేస్తాడు. కానీ నాకు తెలుసు బాబు ప్లాన్ అని దీప అనుకుంటుంది. ఆ తర్వాత వంట చేస్తున్న దీప దగ్గరికి శౌర్య వచ్చి.. రేపు స్కూల్ కి వెళ్ళనని.. బూచోడు వస్తాడని అంటుంది. దాంతో రాడని దీప చెప్తుంది. ఈ విషయం కార్తీక్ వాళ్ళకి చెప్తానని అనగానే.. వద్దని దీప కోప్పడడంతో శౌర్య కోపంగా వెళ్తుంది. మరొకవైపు కావేరితో శ్రీధర్ ఫోన్ మాట్లాడతాడు. అప్పుడే కార్తీక్ వస్తున్నాడని ఫోన్ కట్ చేస్తాడు. శ్రీధర్ కంగారుపడడం చూసి.. ఎవరితో మాట్లాడుతున్నావని ఫోన్ తీసుకుంటాడు. నీకు ఏ రహస్యం లేదు కదా.. లాస్ట్ కాల్ కి నేను చేసి మాట్లాడతానని కార్తీక్ అనగానే.. శ్రీధర్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.