Read more!

English | Telugu

Karthika Deepam2 : ఆ విషయం చెప్పేసిన శౌర్య.. షాక్ లో పారిజాతం!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -47 లో.... జ్యోత్స్న ఆలోచనలో పడి.. గ్లాస్ టేబుల్ చివరన పెడుతుంది. ఆ గ్లాస్ కింద పడుతుంటే కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. కొంచెం అలెర్ట్ గా ఉండాలి కదా జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. అవును అలెర్ట్ గా లేకపోవడం వల్లే ఇక్కడికి వచ్చిందని జ్యోత్స్న అంటుంది.  జ్యోత్స్న ఇంకా జరిగిందే గుర్తుకుచేసుకొని ఆలోచిస్తుందని సుమిత్ర అనుకుంటుంది. ఇప్పుడు బావతో అన్ని విషయాలు డైరెక్ట్ గా మాట్లాడాలని జ్యోత్స్న అనుకొని.. బయటకు వెళదాం బావ అంటుంది. ఎందుకు అలా అడుగుతున్నావు.. నీకు కాబోయే భర్తని కదా ఆర్డర్ వెయ్ అని సుమిత్ర అంటుంది. వెళ్లడం ఇష్టం లేదు కానీ అత్తయ్య ఏమైనా అనుకుంటుందని వెళ్ళక తప్పదని.. కార్తీక్ సరే వెళదామని అంటాడు.

కార్తీక్ , జ్యోత్స్న ఇద్దరు వెళ్తుంటే రోడ్డుపై శౌర్య ఐస్ క్రీమ్ తీసుకుంటు కన్పిస్తుంది.. కార్తీక్ కార్ ఆపి.. ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. ఇదే మా స్కూల్ అని శౌర్య చెప్తుంది. ఎండగా ఉందంటూ శౌర్యని కార్ లో కూర్చొపెట్టి మాట్లాడతాడు కార్తిక్. నేను ఆ స్కూల్ లో జాయిన్ చెయ్యమన్నా కదా అని కార్తీక్ అంటాడు. అందులో జాయిన్ కావాలంటే అమ్మనాన్న చదువుకొని ఉండాలట అని శౌర్య అంటుంది. ఈ స్కూల్ గురించి చెపినట్టు మా అమ్మతో చెప్పకని కార్తిక్ తో శౌర్య అంటుంది. అదంతా వింటున్న జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఎక్కడికి లేదు ఇంటికి వెళ్ళని జ్యోత్స్న కోపంగా అనగానే.. కార్తీక్ సరే అంటాడు. మరొకవైపు సుమిత్రతో కాంచన ఫోన్ మాట్లాడుతుంది. శ్రీధర్ కిచెన్ లో.. ఎవరో ఒకావిడ తో ఫోన్ మాట్లాడతాడు. బేబీ ఈ రోజు వస్తాను మళ్ళీ చేస్తానంటూ ప్రేమగా మాట్లాడతాడు. మళ్ళీ ఏం తెలియనట్టు కాంచన దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడతాడు. ఆ తర్వాత కార్తీక్ వస్తాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని శ్రీధర్ అడుగుతాడు. ఇష్టం లేదనే విషయం కూడా చెప్పలేని సిచువేషన్ లో ఉన్నానని అనుకొని.. రెండు నెలల తర్వాత చెప్తానని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. జ్యోత్స్న జరిగింది చెప్తుంది. అసలు బావకి నేను అంటే కొంచెం కూడా వాల్యూ లేదని జ్యోత్స్న అంటుంది. ఆ పిల్ల ద్వారా అంత తెలుసుకోవాలని పారిజాతం అంటుంది. మరోవైపు దీప, శౌర్య ఇద్దరు సైకిల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పారిజాతం వస్తుంది. సైకిల్ ఏంటని అడుగుతుంది. ఇక శౌర్య సైకిల్ తనదే అని, అది మా అమ్మ పోటీలో గెల్చుకుందని చెప్తుంది. అంతేకాకుండా అది కార్తీక్ ఇచ్చాడని శౌర్య చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.