English | Telugu

Karthika Deepam2 : చెల్లెలి కోసం దశరథ్ పరుగు.. దీపని ఆపేసిన జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -394 లో..... కార్తీక్ దీప ఇద్దరు పారిజాతం చేసిన పని గురించి ఇంటికి వచ్చి కాంచనకి చెప్తారు. మంచిగా బుద్ది చెప్పావని కాంచన, అనసూయ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ మేనకోడలు ఇలాంటివి ఎన్ని చేస్తుందని అనసూయ అనగానే.. అలా అనకు అక్క.. నాకు మేనకోడలు అంటే దీపనే అని జ్యోత్స్న కాదని కాంచన అంటుంది.

ఆ తర్వాత కార్తీక్ కార్ క్లీన్ చేస్తుంటే అప్పుడే జ్యోత్స్న వచ్చి మాట్లాడుతుంది. తనకి కౌంటర్ ఇచ్చేలా కార్తీక్ మాట్లాడుతాడు.‌నీ మాటల్లో ఏదో తేడా ఉంది బావ. బయటకు వెళ్ళాలి బావ కార్ తియ్ అని జ్యోత్స్న అనగానే పెట్రోల్ లేదని కార్తీక్ అంటాడు. అయితే కొట్టించుకొని తీసుకొని రా అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత కాంచనకి చెప్పి అనసూయ బయటకు వెళ్తుంది. కాంచన వీల్ చైర్ నుండే బూజు దులుపుతు ఉంటుంది. అప్పుడే అదుపు తప్పి కింద పడిపోయి.. తలకి రక్తం వస్తుంది.

దీపకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది కాంచన. దాంతో దీప బయల్దేరబోతుంటే జ్యోత్స్న ఆపుతుంది. ఇలా అత్తయ్యకి దెబ్బ తగిలిందని అనగానే.. నువ్వు చెప్పేది అబద్ధం.. మరి ఒకసారి అత్తయ్యకి చెయ్ అని జ్యోత్స్న అంటుంది. కాంచనకి దీప కాల్ చేసేసరికి తన ఫోన్ స్విచాఫ్ వస్తుంది. నువ్వు చెప్పేది అబద్దం అని దీపని బయటకు రాకుండా చేసి బయటున్నా కార్తీక్ ని తీసుకొని బయటకు వెళ్తుంది జ్యోత్స్న. దీప మాటలు దశరథ్ విని చెల్లికి ఏమైంది.. దీప చెప్పేది నిజమేనా అని కంగారుగా కాంచన దగ్గరికి దశరథ్ బయల్దేరతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.