Read more!

English | Telugu

Karthika Deepam2 : వారం రోజుల్లో ఆ రౌడీని పట్టుకుంటాను.. తిరిగొచ్చిన దీప!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'... ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -34 లో.. మీరు కావాలనే దీపని పంపించారని ఇన్‌స్పెక్టర్ ఇంట్లో వాళ్లపై కోప్పడతాడు. దీప బాధ్యత మీరు తీసుకుంటాన్ అన్నారు కదా? ఇప్పుడు ఏమైందని సుమిత్రని ఇన్‌స్పెక్టర్  అడుగుతాడు. అప్పుడే కార్తీక్ వచ్చి.. దీప వెళ్లడం వాళ్ళకి తెలియదు.. అనవసరంగా మాటలు అనకండి అంటూ అంటాడు. దీప ఎక్కడ ఉందో నాకు తెలుసు తీసుకొని వస్తానంటూ  కార్తీక్ వెళ్తాడు.

ఆ తర్వాత మీరు దీపని ఏమైనా అన్నారా అని పారిజాతాన్ని సుమిత్ర అడుగుతుంది. చెప్పకుండా వెళ్లిన ఆ దీపని వదిలేసి తనని అంటావేంటని జ్యోత్స్న అంటుంది. కనీసం నీకైనా చెప్పలేదు.. ఇంట్లో ఉన్న మనకి తెలియలేదు గాని వేరే ఇంటి నుండి వచ్చిన బావకి దీప గురించి తెలిసిందని జ్యోత్స్న అంటుంది. చెప్పకుండా వెళ్లి తప్పు చేసావ్ దీప అని సుమిత్ర మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత దీప ఆటో ఎక్కి వెళ్ళబోతుంటే.. అప్పుడే కార్తీక్ వచ్చి ఆపుతాడు. ఇంటికి పోలీసులు వచ్చారు.. ఒకసారి ఇంటికి వచ్చి ఆ తర్వాత వెళ్ళు అని కార్తీక్ దీప ని రిక్వెస్ట్ చేస్తాడు. దీప సరే అని కార్ ఎక్కుతుంది.. ఆ తర్వాత  అనసూయని శౌర్య చూసి.. అమ్మ నానమ్మ వచ్చిందని చెప్పగానే.. దీప చూసి కార్ ఆపమంటుంది. వెంటనే అనసూయ దగ్గరికి దీప వెళ్లి మాట్లాడుతుంది. అప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చిందంటూ కార్తీక్ పిలుస్తాడు. ఆ తర్వాత అనసూయని తీసుకొని కార్తీక్ తో దీప వెళ్తుంది.

ఆ తర్వాత ఇంటికి వచ్చిన దీపపై సుమిత్ర కోప్పడుతుంది. నేను ఇంత చెప్పిన కూడా వినకుండా ఎందుకు వెళ్ళావని అడుగుతుంది.. తనే పంపించి అలా మాట్లాడుతుందా అని దీపని ఇన్‌స్పెక్టర్ అడుగుతాడు.. నన్నెవరూ పంపించలేదు.. నేనే వెళ్ళిపోయానని దీప చెప్తుంది. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ ఒక రౌడీని తీసుకొని వచ్చి సుమిత్రపై ఎటాక్ చేసింది ఇతనేనా అని అడుగుతాడు. దీప కాదని చెప్తుంది. మీరు కేసుని సీరియస్ గా తీసుకోవడం లేదని ఇన్‌స్పెక్టర్ తో కార్తిక్ అంటాడు. వారం రోజుల్లో వాడిని పట్టుకుంటాను.. దీపని వారం రోజులు ఇక్కడే ఉండమని చెప్పండి అని ఇన్‌స్పెక్టర్ అనగానే.. దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.