English | Telugu

Karthika Deepam2 : సెంట్ నచ్చలేదని భార్యకి విడాకులిస్తానన్న భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -299 లో.... శ్రీధర్, కావేరి ఇద్దరు కార్తీక్ రెస్టారెంట్ కి వస్తారు. శ్రీధర్, కావేరి తిన్న తర్వాత బిల్ కట్టడానికి డబ్బులు మర్చిపోయి వస్తారు. దీపని తిట్టాడని కోపంతో కావేరి కూడ ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్తుంది. పర్లేదు అని దీప అంటుంటే.. ఎందుకలా అంటావ్ ఇలాగేనా బిజినెస్ చేసేది ఇలా అంటూ ఉంటే మనం అప్పు ఎలా కడతామని కార్తీక్ అంటాడు. నేను అన్న మాటలు నాకే అప్పజెప్పుతున్నావా అని శ్రీధర్ అంటాడు. అన్న మాటలు అప్పుతో సమానమని కార్తీక్ అంటాడు.

బిల్ కట్టకపోతే ఏం చేస్తారో తెలుసు కదా ప్లేట్స్ కడగాలని కార్తీక్ అంటాడు. కాసేపటికి శ్రీధర్ ప్లేట్స్ కడుగుతాడు. కూరగాయలు కూడా కట్ చేస్తాడు. ఇక ఈ జన్మ లో నీ రెస్టారెంట్ కి రానని శ్రీధర్ అంటాడు. రా కాకపోతే బిల్ కట్టాలని కార్తీక్ అంటాడు. శ్రీధర్ కోపంగా వెళ్ళిపోతాడు. బాగా అయిందని కార్తీక్, దీపలతో కావేరి అంటుంది. మరొకవైపు శివన్నారాయణ లాయర్ తో ఏదో వీలునామా రాసుకొని తీసుకొనిరా అని చెప్తాడు. అదంతా దూరంగా ఉండి పారిజాతం చూస్తుంది. అసలేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు శివన్నారాయణ వస్తుంటే పారిజాతం డోర్ వెనకాల దాక్కోని ఉంటుంది. శివన్నారాయణ చుడకుండానే అక్కడ ఉన్నావని తెలుసని అంటాడు.‌ అలా ఎలా కనిపెట్టారని పారిజాతం అడుగుతుంది. నువ్వు కొట్టుకున్న సెంట్ వల్ల అని శివన్నారాయణ అంటాడు. లాయర్ ఎందుకు వచ్చాడని పారిజాతం అడుగుతుంది. నీకు విడాకులు ఇస్తున్నానని అనగానే.. ఎందుకని పారిజాతం అడుగుతుంది. నువ్వు కొట్టుకున్న సెంట్ నచ్చలేదని శివన్నారాయణ అంటాడు.

ఎవరైనా అలా చేస్తారా అంటూ పారిజాతం భయపడుతుంది. నాకు అన్యాయం చేయకండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. మరొకవైపు కార్తీక్ ఏదో పేపర్ తీస్తుంటే.. దీప చిన్నప్పటి ఫోటో కిందపడిపోతుంది. అది త్వరగా కార్తీక్ తీసుకుంటాడు. ఎవరిది ఆ ఫోటో అని దీప అడుగుతుంది. నా ప్రాణధాతది అని కార్తీక్ అనగానే.. అదేంటీ నేనే కదా ఆ ఫోటో ఎవరిది చూపించండి అని దీప అంటుంది. అయిన కార్తీక్ సరదాగా ఆటపట్టిస్తాడు. నా ప్రాణధాత ని డైరెక్ట్ నీకే చూపిస్తానని కార్తీక్ అంటాడు. నేను భయటపడాలని అంటున్నాడు కావచ్చు.. నేనేందుకు ఒప్పుకోవాలని దీప సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.