English | Telugu

Illu illalu pillalu : డబ్బున్నోళ్ళలాగా నటిస్తున్న భాగ్యం.. రామరాజు కుటుంబం పసిగట్టగలరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -100 లో....రామరాజు వాళ్ళు ఇంటికి వస్తాను అనడంతో భాగ్యం టెన్షన్ పడుతుంది. మనం బాగా డబ్బున్నోళ్ళమని బిల్డప్ ఇచ్చినాం.. ఇప్పుడు వాళ్ళు ఈ కొంపని చుస్తే ఇంకేమైనా ఉందా నేను చదవిందే ఆరో తరగతి.. బిటెక్ అని చెప్పావని శ్రీవల్లి అంటుంది. ఇవన్నీ సమస్య కంటే ఇంకొక పెద్ద సమస్య ఉంది. రేపు ఇంటికి వస్తే మనం ఉండే ఈ అద్దె కొంపని చూస్తారని భాగ్యం చిన్న కూతురు అంటుంది. అలా జరగకూడదు. ఇలాంటి బకరా సంబంధం మళ్ళీ దొరకదని భాగ్యం అంటుంది.

మరొకవైపు రామరాజు కుటుంబం అందరు భాగ్యం ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు. ధీరజ్, ప్రేమ ఇద్దరు కాలేజీకీ రెడీ అవుతారు. ప్రేమ అని వేదవతి పలకరిస్తుంటే.. బాయ్ అత్తయ్య అంటూ బయటకు వస్తుంది.‌ ధీరజ్ దగ్గరికి వేదవతి వెళ్లి మాట్లాడుతుంది. బాధపడుతుంది.. అయిన కూడా ధీరజ్ మాట్లాడకుండా సైలెంట్ గా ప్రేమని ఎక్కించుకొని వెళ్తాడు. మధ్యలో తనని దింపేసి కాలేజీకి వెళ్తాడు. ప్రేమ ఆటోలో కాలేజీకి వెళ్తుంది. రామరాజు వాళ్ళందరు భాగ్యం ఇంటికి బయల్దేరతారు. మరొకవైపు అమ్మ ఎక్కడికి వెళ్ళింది. వాళ్ళు వస్తారని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.

అప్పుడే రామరాజు కుటుంబం ఆ గల్లీలోకీ వస్తారు. వాళ్ల ఫోన్ కలవకపోవడంతో ఒకతనికి శ్రీవల్లి నాన్న ఫోటో చూపించి వీళ్ళ ఇల్లు ఎక్కడ అనగానే.. ఇడ్లీ అమ్మే అతను కదా అనుకొని చూపిస్తానంటూ తన వెంట తీసుకొని వెళ్తాడు. రామరాజు వాళ్ళని చూసి శ్రీవల్లి వాళ్ళు దాక్కుంటారు. రామరాజు లోపలికి వెళ్తుంటే.. అప్పుడే భాగ్యం బాగా రెడీ అయి అన్నయ్య ఇక్కడ అంటూ పిలుస్తుంది. ఇదే మీ ఇల్లని చెప్పారనగానే చెప్పింది ఎవడు అని చెప్పిన అతన్ని భాగ్యం బెదిరిస్తుంది. తరువాయి భాగంలో మంచి ఇంట్లోకి భాగ్యం వాళ్ళని తీసుకొని వెళ్తుంది. చందు, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. నర్మద బాధపడేలా భాగ్యం మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.