English | Telugu

Karthika Deepam2 : ఒకే బెడ్ పై కార్తీక్, దీప.. అంతా శౌర్య కోసమే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -185 లో......సుమిత్ర, దశరథ్ లు జ్యోత్స్న దగ్గరికి వస్తారు. ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ మనవడు ఉన్నాడు మంచి సంబంధం అంటూ పెళ్లి గురించి మాట్లాడుతారని జ్యోత్స్న అనగానే.. మరేం చేయమంటావని సుమిత్ర అంటుంది. నాకు ఆల్రెడీ బావ తో పెళ్లి అయింది. ఆ దీప బావతో నాకు పెళ్లి చేస్తానంది. ఆ మాట గుర్తు రాలేదా ప్రతీ దాంట్లో వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నట్లు అనిపిస్తుందని జ్యోత్స్న ఫ్రస్ట్రేషన్ అవుతూ మాట్లాడుతుంది.

ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ లు బయటకు వచ్చి.. తను బాధలో ఉంది కొన్ని రోజులు వదిలేద్దామని దశరథ్ అంటాడు. ఒరేయ్ కార్తీక్ నువ్వు దీప మెడలో తాళి కట్టబోయే.. ముందు నా కూతురు గురించి కాకపోయిన నా గురించి ఆలోచించలేదా అని సుమిత్ర అనుకుంటుంది. మరొకవైపు మనం అనుకున్నట్లు రెండు పనులు చేసాం.. ఒకటి దీపని వంట చేయమనడం.. ఇంకొకటి కార్తీక్, దీపలని పక్కపక్కన కూర్చొపెట్టాం.. ఇప్పుడు ఇంకొక పని చెయ్యాలని అనసూయతో కాంచన అంటుంది. ఏంటని అనసూయ అడుగుతుంది. కార్తీక్ తో పాటు నీకు అక్కడే చెప్తానని కార్తీక్ దగ్గరికి కాంచన వెళ్తుంది. మీరు ఎంత కాదనుకున్న ఇప్పుడు భార్యాభర్తలు కలిసి కొత్త జీవితం మొదలు పెట్టేవాళ్ళు.. తన గదిలో తను.. నీ గదిలో నువ్వు ఉంటే ఎలా పెళ్లి అయిన తర్వాత జరగాల్సినవి కొన్ని జరగాలి... కొత్త భార్యాభర్తలతో సత్యనారాయణ వ్రతం చేయించాలని అనుకుంటున్నాను.. నీకు ఏ అభ్యంతరం లేదు కదా అని కాంచన అనగానే.. నాకేం లేదు కానీ దీపని ఏ ఇబ్బంది పెట్టకండి అని కార్తీక్ అంటాడు. అది మేమ్ చూసుకుంటాం.. నీకు ఏ ఇబ్బంది లేదు కదా అని కాంచన అనగానే.. లేదని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత కుబేర్ ఫోటో చూస్తూ దీప బాధపడుతుంటే శౌర్య వస్తుంది. ఇక్కడ పడుకోమని దీప అనగానే.. నేను ఇక్కడ పడుకోను.. నాన్న గదిలో పడుకుంటానని శౌర్య మొండికేస్తుంది. అప్పుడే అనసూయ వచ్చి.. తను కూడా కార్తీక్ గదిలోకి వెళ్ళండి అని చెప్తుంది. దాంతో శౌర్య, దీప ఇద్దరు కార్తీక్ గదిలోకి వెళ్తారు. ఇబ్బందిగానే కార్తీక్ గదిలో పడుకుంటుంది దీప. తరువాయి భాగంలో దీప గుడిలో కూర్చొని బాధపడుతుంటే.. అప్పుడే సుమిత్ర వస్తుంది. తన చేతిలో ఉన్న పండు కింద పడిపోయి దీప దగ్గరికి వస్తుంది. నువ్వు కార్తీక్ ని భర్తగా ఒప్పుకోలేదా అని అడుగుతుంది. లేదని దీప అంటుంది. ఇదిగో ఈ ప్రసాదం.. పంతులు నా కూతురు జ్యోత్స్న కోసం ఇచ్చారు.. ఇది ఇప్పుడు దాని కంటే ఎక్కువ నీకే అవసరం ఉండేలా ఉంది తీసుకోమని దీపకి సుమిత్ర ప్రసాదం ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.