English | Telugu

Karthika Deepam2 : పోరా కుక్క బయటకి అంటు అల్లుడిని గెంటేసిన మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -161 లో... స్వప్నని కాశీ పెళ్లి చేసుకొని శివన్నారాయణ, పారిజాతంల ఆశీర్వాదం కోసం వస్తాడు. ఈ అమ్మాయిని ఎక్కడ పట్టుకొచ్చావ్ రా అంటూ స్వప్నని పారిజాతం తిడుతుంటే.. అలా తిట్టకండి నాకు ఒక ఫ్యామిలీ ఉందని స్వప్న అంటుంది. అయితే మీ వాళ్ళని పిలువు అమ్మ అని శివన్నారాయణ స్వప్నతో అనగానే.. అందరు షాక్ అవుతారు. కాంచనకి ఏమైనా అవుతుందోనని భయంతో పదా అమ్మ వెళదామని కార్తీక్ అనగానే ఇక్కడ ఇంత జరుగుతుంటే ఎక్కడికి వెళదాం.. ఉండమని కాంచన అంటుంది

ఆ తర్వాత పదండి కాశీ అని దీప అంటుంది. వద్దు విషయం ఇంత వరకు వచ్చింది శివన్నారాయణ‌ మనవడు ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అంటే పోయేది ఈ ఇంటి పరువు.. ఈ సమస్య ని ఇప్పడే పరిష్కారించాలని శివన్నారాయణ అంటాడు. ఎక్కడ నిజం బయటపడుతుందోనని.. వాళ్ళతో మాటలు ఏంటి పంపించండి అని పారిజాతం అనగానే.. ఈ విషయం లో సైలెంట్ గా ఉండమని పారిజాతంపై శివన్నారాయణ కోప్పడతాడు. స్వప్నని పారిజాతం తిడుతుంటే ఇంకొకసారి నా గురించి తప్పు గా మాట్లాడితే మర్యాదగా ఉండదని స్వప్న అంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. అక్కడ స్వప్నని చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. మీరేంటి ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరు నన్ను అవమానిస్తున్నారు.. నేను ఎవరో అందరికి చెప్పండి అని శ్రీధర్ తో స్వప్న అంటుంది. మీ డాడ్ గురించి అంటే అతన్ని చెప్పమంటావని శివన్నారాయణ అనగానే.. అతనే మా డాడ్ శ్రీధర్ అని స్వప్న అనగానే అందరు షాక్ అవుతారు. నా అల్లుడిని పట్టుకొని డాడ్ అంటున్నావని శివన్నారాయణ అనగానే.. అల్లుడు ఏంటని స్వప్న షాక్ అవుతుంది.

ఆ తర్వాత అతను నా కూతురు భర్త కార్తీక్ తండ్రి అని శివన్నారాయణ‌ చెప్తూ స్వప్నని తిడుతుంటే.. నా కూతురిని ఏం అనకండి మావయ్య అని శ్రీధర్ అనగానే అందరూ షాక్ అవుతారు. తను నా కూతురు.. నా రెండో భార్య కూతురని శ్రీధర్ చెప్పగానే.. కాంచన మనసు ముక్కలు అవుతుంది. శ్రీధర్ పై చెయ్ చేసుకుంటాడు శివన్నారాయణ‌. పోరా కుక్క అంటు తిడతాడు. అందరిని ఇంట్లో నుండి వెళ్ళమనగానే అందరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.