Read more!

English | Telugu

Karthika Deepam2 : తన భార్యని వేరొకడితో చూసి షాకైన నరసింహా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -16 లో..  శౌర్యని ఎలా పడితే అలా మాట్లాడకూడదని దీప కోప్పడుతుంది. మరి ఎలా ఉండాలో చెప్పు అమ్మ.. అన్నీ రాసివ్వు బట్టీ పట్టి మాట్లాడతానని శౌర్య అనగానే..‌ ఇదిగో ఇలానే వద్దని దీప ఆంటుంది. పండక్కి నాన్న వస్తాడా అమ్మ అని శౌర్య అడుగగా.. మనమే వెళ్తామని దీప చెప్తుంది. బట్టలు కొనుక్కోవడానికి బయటకెళ్తున్నామని శౌర్యతో దీప చెప్పి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎన్ని ఉన్నాయోనని చూస్తుంది. ఇక డబ్బులు తక్కువగా ఉండటంతో శౌర్యకి ఒక్కదానికే తీసుకుంటానని దీప అనుకుంటుంది. 

బయట ఫుట్ పాత్ మీద డ్రెస్ లు చూసి దీప, శౌర్య అక్కడికి వెళ్తారు. అందులో ఒక డ్రెస్ శౌర్యకి నచ్చుతుంది. ఇది ఎంత అని డ్రెస్ లు అమ్మేవాడిని అడుగగా.. మూడొందలని చెప్తాడు. నూటతొంభై కి ఇవ్వన్నా అని దీప అనగానే.. రాదమ్మ.. డబ్బులు ఇంటే తీసుకోండి లేదంటే వెళ్ళిపోండి అని అతను అనగానే.‌.‌ దీప రిక్వెస్ట్ చేస్తుంది. భళే ఉన్నారమ్మ డబ్బులు లేవు కానీ వస్తారు. బేరాలు పోతాయి వెళ్ళండి అని అతను దీప మీద విసుక్కోగా.. ఏంటి నీ డ్రెస్ నీకు ఇచ్చేశాం కదా.. మరెందుకు ఇలా మా అమ్మని అంటున్నారని శౌర్య అనగా.‌. వద్దని దీప చెప్తుంది. ఇక అతను విసుక్కోగా.. అక్కడ రాయితో కొట్టాలని శౌర్య చేతిలోకి తీసుకోగా కార్తిక్ వచ్చి ఆపుతాడు. మా అత్తమ్మ మిమ్మల్ని షాపింగ్ కు తీసుకెళ్ళమని చెప్పిందని కార్తిక్ అనగానే.. దీప రానని చెప్తుంది. మరి మా అత్తమ్మతో మాట్లడుకోండి అని కార్తిక్ అంటాడు. ఇక శౌర్యని కార్తిక్ తీసుకొని కార్ వైపు వెళ్లగానే.. ఇంకేం చేయలేక దీప కూడా వెళ్తుంది. షాపింగ్ మాల్ కి కార్తిక్ తో పాటుగా దీప, శౌర్య‌ ఇద్దరు వెళ్తారు. ఇక అక్కడి మేనేజర్ నెంబర్ ను కార్తిక్ తీసుకొని.. అక్కడే ఉండి ఫోన్ చేస్తాడు. వాళ్ళు బట్టలు తీసుకుంటారు. డబ్బులు నేను కడతాను. మీరు వారికి తొంభై శాతం డిస్కౌంట్ అని చెప్పండి అని కార్తిక్ అనగానే.‌.మేనేజర్ సరేనని చెప్తాడు.

కాసేపటికి ఓ డ్రెస్ మీద రెండు వేలు‌ రేటు చూసి భయపడి వెళ్దామని శౌర్య, దీప అనుకోగా.‌. మేనేజర్ వచ్చి ఆ డ్రెస్ కి రెండొందలే అని తొంభై శాతం డిస్కౌంట్ అని చెప్తాడు. ఆ తర్వాత రేట్లు తక్కువే కదా అమ్మ నువ్వు కూడా చీర తీసుకోమని శౌర్య అనగానే.. సరేనని దీప కూడా తీసుకుంటుంది. ఇక పదే పదే సర్ అని కార్తిక్ ని శౌర్య పిలవడంతో.. మనమిద్దరం ఫ్రెండ్స్ కదా,‌ నన్ను కార్తిక్ అని పిలువు నేను నిన్ను రౌడీ అని పిలుస్తానని కార్తిక్ అంటాడు. ఆ తర్వాత షాపింగ్ పూర్తిచేసుకొని బయటకు వెళ్తుంటే.. దీప భర్త నరసింహా అదే షాపింగ్ కు వస్తాడు. వాళ్ళిద్దరితో కార్తిక్ ని చూసి.. వీడెవడు నా భార్య, కూతురితో ఉన్నాడని నరసింహా అనుకుంటాడు. ఇక దీప అని పిలిచేలోపే వాళ్ళు కారులో వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.