English | Telugu

వాళ్ళ ట్రోలింగ్ మాములుగా ఉండదు మరి!

కార్తీకదీపం షోలోకి దీప తిరిగి రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురౌతున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ షోలోకి దీప కోమా స్టేజి నుంచి కోలుకుంటున్నట్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు దీప కార్తీక్ కోసం ఆరా తీస్తూ, మార్చురీలో ఉన్నట్లు చూపించారు. "మార్చురీలో మిగిలిన జ్ఞాపకంతో కుమిలిపోతున్న దీపఅనే టాగ్ లైన్ తో దీప బాధను స్టార్ మా తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది. చాలా ఏళ్ల తర్వాత దీప కోమాలోంచి బయటికి వస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళైపోయినప్పటికీ దీప మాత్రం చాలా యంగ్ గా కనిపించింది. ఇక ఈ వీడియోను నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మృతదేహాన్ని ఇన్నాళ్లుగా మార్చురీలో ఉంచడం ఏంటని పలువురు నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. దీప, కార్తీక్ సజీవంగా ఉన్నారని మేకర్స్ గత ఎపిసోడ్ లో చెప్పారు.

ఆటో డ్రైవర్ వారణాసి కనిపించి దీప, కార్తీక్ చనిపోలేదని సౌందర్య వాళ్ళ ఫామిలీకి చెప్తాడు. తర్వాత కొన్నాళ్ళకు దీప హాస్పిటల్ నుంచి లేచినట్టు కనిపిస్తుంది. లీడ్ రోల్స్ ఐన కార్తీక్, దీప కూర్గ్ ట్రిప్‌ కి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్‌కు గురైనట్లు చూపించారు. తర్వాత షోలో కార్తీక్ , దీప చనిపోయారని విషయం పిల్లలతో చెప్పించారు. అలాగే డాక్టర్ బాబు ని పెళ్లి చేసుకోవాలని కుట్రలు పన్నిన మోనిత తన పిల్లాడిని విడిచిపెట్టి, మతిమరుపు స్టేజి లోకి వెళ్ళిపోతుంది.

హిమ తమ తల్లిదండ్రులను చంపిందని తోబుట్టువు హిమపై ద్వేషంతో సౌర్య ఇంటి నుంచి పారిపోతుంది. నిరుపమ్‌ను ఆమె నుంచి లాక్కున్నందుకు సౌర్య హిమను మరింత ద్వేషిస్తూ ఉంటుంది. దీప కోమా స్టేజి నుంచి బయటికి రావడంపై నెటిజన్స్ గమ్మత్తైన కామెంట్స్ చేస్తున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.