English | Telugu
మళ్లీ షాకిచ్చిన మోనిత.. కీలక మలుపు
Updated : Dec 25, 2021
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీక దీపం'. ప్రతీ రోజు ఆసక్తికరమైన మలుపులు ఊహకందని ట్విస్ట్ లతో సాగుతున్న ఈ సీరియల్ ఈ శనివారం మరో ట్విస్ట్ ని అందించబోతూ కీలక మలుపు తిరగబోతోంది. ఈ శనివారం 1232వ ఎపిసోడ్ లోకి ఎంటరవుతోంది. ఈ సందర్భంగా జరిగే నాటకీయ పరిణామాలు.. కీలక మలుపులు ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ ని ఆశ్చర్యాన్ని కలిగించబోతున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.
`మనం ఎన్ని పోగొట్టుకున్నా ఒకరికి ఒకరం ఉన్నాం కదా డాక్టర్ బాబు .. ఎంత కష్టపడితే ఏముంది అంటుంది దీప. వెంటనే డాక్టర్ బాబు దీప ఒడిలో పడుకుంటాడు. తలని నిమురుతూ కార్తీక్ కి ప్రేమగా చాలా ధైర్యాన్ని నింపుతుంది.. అయినా సరే కార్తీక్ .. రుద్రాణి అప్పు గురించే ఆలోచిస్తూ వుంటాడు. కాసేపటికి అదే ఆలోచించుకుంటూ రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతుంటాడు కార్తీక్.. అతనికి ఎదురుగా హిమ.. సౌర్య వస్తారు. ఇంతలో హిమ కడుపులో తిప్పుతోంది అంటూ వంఆతి చేసుకుంటుంది. .. దీంతో షాక్ కు గురైన కార్తీక్ ఏం కాలేదు.. ఏంపర్లేదు అంటూ వారిని ఇంటికి తీసుకెళతాడు..
ఇదిలా వుంటే రుద్రాణి కార్తీక్ కిచ్చిన టైమ్ దగ్గరపడుతూ వుంటుంది. ఇదే విషయాన్ని రుద్రాణి .. కార్తీక్ ని అడుగుతుంది. రోజులు గడుస్తున్నాయే కానీ నీ నుంచి బాకీ వసూలయ్యే అవకాశం కనిపించడం లేదు. నిన్ను చూస్తే జాలేస్తోంది. అంత డబ్బు ఎలా కడతావ్ అంటుంది రుద్రాణి.. సంతకం పెట్టాను కదా.. ఎలా తీరుస్తాను అన్నది మీకు అనవసరం అంటూ అక్కడి నుంచి పిల్లలని తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్.. కట్ చేస్తే...బస్తీలో `వంటలక్క ప్రజా వైద్యశాల` అంటూ బోర్డు వెలుస్తుంది. దీప వాళ్లు గతంలో ఉన్న ఇంటి ముందు మోనిత ఆ బోర్డ్ పెట్టిస్తుంటుంది. వారనాసితో సహా అంతా అక్కడికి వస్తారు.. బస్తీ వాసులకు శుభవార్త అంటూ మోనిత షాకిస్తుంది..ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.