English | Telugu
దీప్తితో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్!
Updated : Dec 26, 2021
బిగ్ బాస్ 5 తెలుగు రెండు జంటల బ్రేకప్ కి కారణమైందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ అయిన షణ్ముఖ్, సిరి.. హౌస్ లో వారి బిహేవియర్ కారణంగా పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నారని న్యూస్ వినిపిస్తోంది. షణ్ముఖ్ కి బ్రేకప్ అయిందని, సిరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తన బ్రేకప్ వార్తలపై షణ్ముఖ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
బిగ్బాస్ హౌస్ లోకి వెళ్లకముందే షణ్ముఖ్, దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నాడు. సిరి కూడా బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రీహాన్ ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే హౌస్ లో షణ్ముఖ్, సిరిల బిహేవియర్ పై ట్రోల్ల్స్ వచ్చాయి. ఫ్రెండ్ షిప్ పేరుతో హగ్స్ తో హద్దు దాటారు అంటూ పలువురు తప్పుబట్టారు. అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమే అని హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ బ్రేకప్ న్యూస్ వినిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా షణ్ముఖ్ ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ కి రాగా దీప్తితో బ్రేకప్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో దీప్తితో బ్రేకప్ జరగదు అని తేల్చి చెప్పాడు. "దీపూ నన్ను బ్లాక్ చేసింది. అలిగినప్పుడు అలా బ్లాక్ చేస్తూ ఉంటది. ప్రజెంట్ వైజాగ్ లో ఉన్నాను. త్వరలోనే హైదరాబాద్ వెళ్లి దీపూని కలుస్తాను. దీపూ నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్ చేసింది. అయినప్పటికీ నాకోసం నిలబడింది. తనతో బ్రేకప్ మాత్రం జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపూని వదలను" షణ్ముఖ్ అన్నాడు.
అలాగే దీప్తిని ఇన్ స్టాలో అన్ ఫాలో ఎందుకు చేసావని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చాడు షణ్ముఖ్. బిగ్ బాస్ కి వెళ్ళకముందు నుండే తనని ఫాలో అవ్వడం లేదని చెప్పాడు. పెళ్లి తర్వాత ఒకరినొకరం ఫాలో అవుతామని నవ్వుతూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.