English | Telugu

ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభాశెట్టి అలియాస్ మోనిత

బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా వెళ్లిన వాళ్లంతా కూడా బయటకు వచ్చాక ఎన్నో రకాల అవకాశాలను అంది పుచ్చుకుంటున్నారు. ఈ షో తర్వాత ఫేమస్ ఐన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో శోభాశెట్టి కూడా ఒకరు అని చెప్పొచ్చు. కార్తీక దీపం సీరియల్ తెలుగు ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్ లో దీప, కార్తీక్ తో పాటు.. విలన్ రోల్ లో చేసిన శోభాశెట్టి అలియాస్ మోనితకి కూడా ఎంతో మంచి పేరొచ్చింది. శోభాశెట్టి అనే పేరుతో కంటే మోనిత అనే పేరుతోనే బాగా ఫేమస్ అయ్యింది.

ఇక అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఆ షోలో తన లవర్ ని పరిచయం చేసింది. మోనిత లవర్ ఎవరో కాదు కార్తీక దీపం సీరియల్ లో నటించిన యశ్వంత్ అని చెప్పేసింది. కార్తీకదీపం సీరియల్ చేస్తున్నప్పుడే.. ప్రేమలో పడినట్లు చెప్పారు. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లోను కలిసి నటించారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఐతే జనవరిలో కూడా ఎంగేజ్మెంట్ లాంటిది జరిగింది కదా అని చాలా మంది డౌట్ అడిగేసరికి అది జస్ట్ పెళ్లి చూపులు మాత్రమే అని వాళ్ళ శాస్త్రం ప్రకారం మొదట అది జరుగుతుంది అని చెప్పింది. అది ఎంగేజ్మెంట్ కాదని తన వీడియోస్ లో ఎంగేజ్మెంట్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఇక తన ఎంగేజ్మెంట్ కి నచ్చినట్టు శారీ డిజైన్ చేయించుకుని మరీ వేసుకుని ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.