English | Telugu

అలాంటి యాప్స్ తో జాగ్రత్తగా ఉండండి!


వాసంతి కృష్ణన్ తెలుగు నటి, బిగ్ బాస్ బ్యూటి కూడా. బిగ్ బాస్ సీజన్ 6 లో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది ఈ బ్యూటిఫుల్ లేడీ. సిరిసిరి మువ్వా, గోరింటాకు, గుప్పెడంత మనసు లాంటి సీరియల్స్ తో పాపులర్ అయ్యింది వాసంతి. ఇక రీసెంట్ గా తనకు ఇష్టమైన అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుంది. వాసంతి సోషల్ మీడియాలో షేర్ చేసే గ్లామర్ ఫొటోస్ కి స్పెషల్ ఫాన్స్ కూడా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కూడా ఉంటుంది. ఐతే సెలబ్రిటీస్ అంతా కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాసంతి కూడా అలాంటి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసింది.

ఐతే ఇప్పుడు ఒక తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టేటస్ పోస్ట్ చేసింది. "హలో ఫ్యామిలీ ..నేను బెట్టింగ్ / ట్రేడింగ్ ప్రమోషన్‌లు ఎం చేసినా అవి పెయిడ్ ప్రొమోషన్స్ కాబట్టి చేస్తున్నాను ..ఎందుకంటే అవే మా జీవనాధారం.. నేనే కాదు.. ఏ సెలబ్రిటీ ఏ ప్రమోషన్ చేసినా వాళ్ళ సంపాదన కోసమే చేస్తారు. కాబట్టి మీరు ఓకే అనుకుంటేనే మీ డబ్బు ఖర్చు చేయండి.. దయచేసి మీ డబ్బు ఖర్చు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి" అంటూ ఒక అవేర్ నెస్ ని క్రియేట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఈజీ మనీ కోసం అలవాటు పడుతున్నారు. దాని వల్ల బెట్టింగ్ , ట్రేడింగ్ యాప్స్ లో మనీ ఇన్వెస్ట్ చేసి మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఎన్నో ఇన్సిడెంట్స్ ని మనం చూస్తూనే ఉన్నాం. అలా జరగకుండా ఉండేందుకు ముందుగా వాసంతి ఒక హెచ్చరిక లాంటిది పోస్ట్ చేసింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.