English | Telugu

16 ఏళ్లకే కమిట్మెంట్ అడిగారు...చక్రవాకంలో ఒక రోల్ చేసాను

ఏ ఇండస్ట్రీలో ఐనా, ఏ రంగంలో ఐనా కావొచ్చు క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ అనేవి ఆడవాళ్లు ఎదుర్కునే కొన్ని కీలకమైన అంశాలు. స్టార్ హీరోయిన్స్ చాలా మంది వీటి బారిన పడిన వాళ్ళే. అవకాశం కావాలంటే కచ్చితంగా వాళ్ళు చెప్పిన కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. రీసెంట్ గా హీరో వరుణ్ సందేశ్ వైఫ్ వితికా షేరు కూడా కమిట్మెంట్ బారిన పడినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఐతే తన 16 ఏళ్ల వయసప్పుడు ఓ తెలుగు సినిమా ఆడిషన్స్ కి వెళ్లినట్లు చెప్పింది. కన్నడ సినిమా చేసాక తెలుగులో సినిమా అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగానట్లు చెప్పింది.

ఇప్పుడంటే ఇన్ స్టాలో ఫోటోలు, రీల్స్ పెడితే ఛాన్సులు వస్తున్నాయి కానీ ఒకప్పుడు అవకాశాలు అంత సులువుగా వచ్చేవి కాదని, ఫోటో షూట్ చేయించుకుని ఆ ఫొటోస్ తీసుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని చెప్పారు. అయితే ఆడిషన్ కి వెళ్ళినప్పుడు కలర్ తక్కువని రిజెక్ట్ చేసేవారని గుర్తు చేసుకున్నారు. వితికా షేరు అన్న పేరు వినగానే నార్త్ నుంచి వచ్చిన అమ్మాయి అనుకునేవారని.. తీరా తెలుగు అమ్మాయి అని తెలిసాక చిన్న చూపు చూసేవారన్నారు. 16 ఏళ్ల వయసులో అమ్మతో కలిసి ఆడిషన్స్ కి వెళ్తే అక్కడ సెలెక్ట్ ఐనా కూడా కమిట్మెంట్ అడిగారని చెప్పింది. రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ అవకాశం ఇవ్వమని అడిగానని కానీ కమిట్మెంట్ ఇస్తేనే అవకాశం ఇస్తానంటే వద్దని చెప్పేసానని గుర్తు చేసుకున్నారు. బాగా తెలిసిన వారే తనను కమిట్మెంట్ అడిగారన్నారు. అయితే వారి పేర్లు మాత్రం చెప్పలేదు. అలాగే 11 ఏళ్ళ వయసులో చక్రవాకం సీరియల్ లో విలన్ కి మనవరాలి క్యారెక్టర్ లో నటించానని చెప్పింది. ఆ రోల్ చేసిన మూడు రోజులకే చికెన్ పాక్స్ రావడంతో ఆ రోల్ ని సీరియల్ లో తీసేశారని చెప్పింది వితిక.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.