English | Telugu
సౌందర్యతో వార్ డిక్లేర్ చేసిన మోనిత!
Updated : Mar 16, 2021
'కార్తీకదీపం' మంగళవారం ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగబోతోంది. సిటీ వదిలేసి ఇద్దరు పిల్లలతో వారణాసి బంధువుల ఇంటికి చేరుకున్న వంటలక్క అక్కడ మళ్లీ అదే జీవితాన్ని ప్రారంభిస్తుంది. టిఫిన్ సెంటర్‌ని ప్రారంభిస్తుంది. వంటలక్క చేతి వంట నచ్చడంతో కార్లల్లో కస్టమర్లు వచ్చేస్తుంటారు. కట్ చేస్తే మోనిత ఇంట్లో కార్తీక్ మంతనాలు చేస్తుంటాడు. హిమని త్వరగా వెతకమని మోనితకు చెబుతుంటాడు.
"దాదాపు అన్ని హాస్పిటల్స్‌కి దీపతో పాటు పిల్లల ఫోటొలు పంపించాను. వాళ్లు చిన్నా చితకా క్లినిక్స్‌కి కూడా పంపిస్తారు. వాళ్లకు ఏ జలుబో జ్వరమో వచ్చి హాస్పిటల్స్‌కి వెళ్లినా ఇట్టే ఈజీగా దొరికిపోతారు. అలాగే నాకు తెలిసిన ఫార్మాస్యూటికల్ రిప్రజెంటేటివ్స్‌కి కూడా ఈ విషయం చెప్పాను. ఆ కంపనీలు సప్లై చేసే మెడికల్ షాప్స్‌లో కూడా అందరి ఫొటోలు వుంటాయి." అంటుంది మోనిత. "నిజంగా గుడ్ ఐడియా. వాళ్లని వెతికి పట్టుకోవడానికి ఇదొక మంచి దారి." అంటాడు కార్తీక్.. ఇలా వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగానే సౌందర్య ఎంట్రీ ఇస్తుంది.
"ఫ్యూచర్ ప్లాన్స్ చాలా వున్నట్టున్నాయి సుపుత్రా అంటుంది." సౌందర్య.. "నువ్వు కొంచెం బయటికి వెళతావా నాన్నా.. మోనితతో కొంచెం మాట్లాడాలి." అంటుంది.. ముందు కార్తీక్‌ని బయటికి వెళ్లవద్దని అడ్డు తగిలిన మోనిత ఆ తరువాత "ఏంటీ కాళ్లబేరానికి వచ్చారా?" అంటుంది. "కాళ్లబేరానికి రావడానికి నేను వసుదేవుడిని కాదు.. నువ్వు గాడిదవి కాదు." అంటుంది సౌందర్య.. "ఒక ఆడదానికి వుండాల్సిన లక్షణాలు నీలో అణువంత కూడా లేవు. కార్తీక్‌ని నీ మాయమాటలతో పడేశావు... ఇప్పటికైనా నీ వృధా ప్రయాస మానుకోమని హెచ్చరించడానికి వచ్చాను." అంటుంది. "నేను దీన్ని ఓ సవాల్‌గా స్వీకరించడానికి సిద్ధంగా వున్నాను. మీకూ నాకూ మధ్య ఇవ్వాళ్టి నుంచి వార్ మొదలైంది." అంటుంది మోనిత. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
