English | Telugu

'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు'కు డేట్‌, టైమ్ ఫిక్స్‌

స్టార్ మాలో స‌రికొత్త సీరియ‌ల్ 'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు' ప్రారంభం కాబోతోంది. 'మౌన‌రాగం' సీరియల్‌లో హీరోయిన్‌గా న‌టించ‌డం ద్వారా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ప్రియాంక జైన్‌, అమ‌ర్‌దీప్ చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఇదే సీరియ‌ల్‌తో న‌టుడు రాజా ర‌వీంద్ర‌, న‌టి రాశి బుల్లితెరంగేట్రం చేస్తున్నారు. మెయిన్ లీడ్ గా న‌టిస్తున్న ప్రియాంక జైన్‌కి తండ్రిగా రాజా ర‌వీంద్ర న‌టిస్తుంటే.. ప్రియాంక జైన్‌కి జోడీగా న‌టిస్తున్న అమ‌ర్‌దీప్ చౌద‌రికి త‌ల్లిగా రాశి న‌టిస్తున్నారు.

ఐపీఎస్ ఆఫీస‌ర్ కావాల‌నుకున్న ఓ అమ్మాయికి, చ‌దువు ఏమాత్రం అబ్బ‌క స్వీట్ షాప్‌ని రన్ చేస్తున్న అబ్బాయికి పెళ్లి జ‌రిగితే ఆ బంధం ఎలా వుంటుంది?.. భార్య కోరిక తెలుసుకున్న భర్త ఆమెకు ఎలా అండ‌గా నిల‌బ‌డ్డాడు?.. త‌న కొడుకు కంటే ఎక్కువ చ‌దివే కోడ‌లుని త‌న ఇంటికి తెచ్చుకోన‌ని చెప్పే తల్లికి తెలియ‌కుండా కొడుకు త‌న భార్య‌ని ఎలా ఐపీఎస్ చ‌దివించాడు.. అన్న‌దే ఈ సీరియ‌ల్ అస‌లు క‌థ‌. హిందీ సూప‌ర్ హిట్ సీరియ‌ల్‌ 'దియా ఔర్ బాతీ హ‌మ్‌'కు రీమేక్‌గా ఈ సీరియ‌ల్‌ని నిర్మించారు.

అక్క‌డ 1487 ఎపిసోడ్‌లు విజయ‌‌వంతంగా ప్ర‌సారం అయిన ఈ సీరియ‌ల్ తెలుగులోనూ అదే స్థాయిలో ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. స్టార్ మాలో ఈ ధారావాహిక ఈ నెల 22 నుంచి రాత్రి 9 గంట‌ల‌కు సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ప్ర‌సారం కానుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.