English | Telugu

Karthika Deepam 2 : నీ కూతురు దీప అయితే మరి నేనెవరిని అమ్మ.. జ్యోత్స్న ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -43 లో.. నర్సింహా నీకు ముందే తెలుసా అని కార్తీక్ ని సుమిత్ర అడుగుతుంది. తెలుసు కానీ వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడని నిన్న రాత్రే తెలిసిందని కార్తీక్ అంటాడు. నేనే వెళ్లి వాడితో మాట్లాడాలనుకున్నాను కానీ వాడే వచ్చి ఇలా గొడవ చేస్తాడు అనుకోలేదని సుమిత్ర అనగానే.. నువ్వేం అనుకోవు సుమిత్ర అంటూ పారిజాతం తనపై కోప్పడుతుంది.

దీపని ఇంటికి తీసుకొని వచ్చావ్ అప్పుడే మనకి దరిద్రం మొదలైందని పారిజాతం అనగానే.. అయిపోయిన దాని గురించి ఎందుకని కార్తీక్ అంటాడు. నీకు అన్నీ తెలుసు అందరికంటే ముందే తెలుసు కానీ ఏం తెలియనట్టు ఉంటావని కార్తీక్ తో పారిజాతం అంటుంది. ఈ ఇంటికి సమస్యలు దీప రాకతోనే మొదలయ్యాయని దీపని పారిజాతం తిడుతుంటే.. శివన్నారాయణ ఎందుకు అలా అంటున్నావని అంటాడు. గ్రానీ అన్న దాంట్లో తప్పేముందంటూ జ్యోత్స్న అంటుంది. ఆగు జ్యోత్స్న అని కార్తిక్ అనగాగే.. నువ్వు ఆగు బావ.. నీకు మాట్లాడే హక్కులేదని జ్యోత్స్న అనగానే.. అందరు షాక్ అవుతారు. ఎవడో వచ్చి బావకి ఆ దీపకి సంబంధం పెడుతుంటే సైలెంట్ గా ఉన్నారు కానీ నాకు మాత్రం మనసుకు చాలా కష్టంగా ఉంది. వాడు అలా మాట్లాడుతుంటే నీ దగ్గర సమాధానం ఉందా? ఎందుకు మౌనంగా ఉండిపోయావ్? వాడు అలా మాట్లాడుతుంటే.. నాకు ఎంత కష్టంగా ఉంటుంది.. చిన్నప్పటి నుండి బావనే ప్రాణంగా బ్రతుకుతున్నాను.. వాడెవడో వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే బావకి కాబోయే భర్తగా నాకెలా ఉంటుందని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది.

అందరి ముందు దీప నా కూతురు అంటున్నావ్.. మరి నేనెవరిని అమ్మ అంటు సుమిత్రని జ్యోత్స్న అడుగుతుంది.. జ్యోత్స్న నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత దీప బాధపడుతుంటే కార్తీక్ తన దగ్గరకి వెళ్తాడు. వాడన్న మాటల కంటే మీ వల్లే నేను ఎక్కవ బాధపడుతున్నానని కార్తీక్ తో దీప అంటుంది.. నేను ఇక్కడ ఉండాలి కాబట్టి వెళ్లలేకపోతున్నాను.. మా కూతురు జోలికి రాకండి అని కార్తీక్ ని దీప రిక్వెస్ట్ చేస్తుంది. మీకు సాయంగా ఉండాలనుకున్నాను.. మీ సిచువేషన్ తెలిసి జాలి కలిగింది.. మీక హెల్ప్ చేయాలి అనుకున్నాను నేను శౌర్యకి దూరంగా ఉండలేనని దీపకి కార్తిక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.