English | Telugu
Karthika Deepam 2 : కొంపముంచిన స్వప్న పెళ్లి.. ఇంకెప్పుడు కలిసేది!
Updated : Sep 29, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -162 లో......స్వప్న నా చెల్లి లాంటిది అని అన్నావ్.. అలా కాకుండా నా సొంత చెల్లి, తల్లి వేరే కానీ తండ్రి ఒక్కడే అని కాంచన కార్తీక్ తో అంటుంది. నా లాంటి పరిస్థితి మీకు వస్తే ఏం చేస్తారు అన్నప్పుడు చెప్పాలిసింది దీప నా మొగుడు లాగే నీ మొగుడు మిమ్మల్ని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని దీపతో కాంచన అంటుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.. నేనే చావను అంటు కాంచన లోపలికి వెళ్తుంది.
ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావ్.. వాళ్ళ పెళ్లి దీనికి పరిష్కారమా నాకోక మాట చెప్పొచ్చు కదా అని దీపపై కార్తిక్ కోప్పడతాడు. నేనేం వాళ్ళని తీసుకొని వెళ్లి పెళ్లి చెయ్యలేదు. మీ నాన్న స్వప్నకి వేరొక అబ్బాయితో పెళ్లి చేయబోతుంటే ఆపి ఈ పెళ్లి చేసాను లేకపోతే మీ చెల్లి బ్రతకనంది అని జరిగింది మొత్తం కార్తీక్ కి వివరిస్తుంది. అప్పుడే శ్రీధర్ కాంచన దగ్గరికి వస్తాడు. మరొకవైపు ఎందుకమ్మ ఇన్ని రోజులు నాకు చెప్పలేదు.. ఇంత బాధలో కూడా ఇక సంతోషం అయిన విషయం ఏంటంటే.. కార్తీక్ నా అన్న అని స్వప్న అంటుంది. ఆ తర్వాత కావేరి దగ్గరికి స్వప్న, కాశీ లు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. స్వప్న కాశీలని దాస్ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఆ దీప కావాలనే వాళ్ళ పెళ్లి చేసింది. నాకు బావ కావాలని జ్యోత్స్న పారిజాతంతో అంటుంది. అయితే వెళ్లి మీ తాతయ్యతో బావ నాకు కావాలని చెప్పు అంటుంది. దాంతో పారిజాతం, జ్యోత్స్న శివన్నారాయణ దగ్గరికి వెళ్తుంటే.. తనే కోపంగా శ్రీధర్ ఉన్న ఫ్యామిలీ ఫోటో ని పగులగొట్టి.. రేయ్ దశరథ్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పదా అని అంటాడు. మీరేం చేసిన జ్యోత్స్నని దృష్టిలో పెట్టుకొని చెయ్యండి అని పారిజాతం అంటుంటే.. నాకేం చెయ్యాలో తెలుసు అని శివన్నారాయణ అంటాడు.
మరొకవైపు కాంచన కాళ్ళ మీద పడి తనని క్షమించమని అడుగుతాడు శ్రీధర్. మీరు చేసింది తప్పు కాదు నమ్మకద్రోహం అంటూ కాంచన ఎమోషనల్ అవుతుంది. అప్పుడే కావేరి ఇంటికి వస్తుంది. మీరు వచ్చారేంటని కార్తీక్ అడుగుతాడు. ఆవిడ రమ్మని ఫోన్ చేసారని కావేరి చెప్తుంది. అమ్మ ఎందుకు రమ్మంది అనుకుంటారు. ఆ తర్వాత నువ్వేం శిక్ష వేసిన ఒప్పుకుంటానని శ్రీధర్ అనగానే.. అయితే వెళ్లి డోర్ తీయండి అని కాంచన అనగానే శ్రీధర్ డోర్ తీసాడు. బయట కార్తీక్, దీప దగ్గర కావేరి ఉంటుంది. తనని చూసిన శ్రీధర్ షాక్ అవుతాడు. నేనే రమ్మని చెప్పానని కాంచన అంటుంది. కావేరితో కాంచన మాట్లాడి.. కాసేపటికి దీపకి చెప్పి చీర తెప్పించి ఇస్తుంది. కార్తీక్ తో ఒక బ్యాగ్ తెప్పించి మీ నాన్న ముందు పెట్టు అంటుంది. అక్కడ కాంచన ఏం చేస్తుందో ఎవరికి అర్ధం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.