English | Telugu
దీపని మెచ్చుకున్న పారిజాతం.. శ్రీధర్ కి కావేరి ఫోన్.. జస్ట్ మిస్!
Updated : Aug 25, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం-2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 132లో.. పారిజాతం దగ్గరకు వచ్చిన దాసు.. జ్యోత్స్న ఎంతలా దిగజారిపోతుందోనని బాధపడతాడు. తన కళ్ల ముందే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే పట్టించుకోకుండా వెళ్లిందని ఎమోషనల్ అవుతాడు. తర్వాత తన కొడుకు యాక్సిడెంట్ వీడియో పారిజాతానికి చూపిస్తాడు. ఈ వీడియోలో ఉన్న కాశీ తన కొడుకని దాసు చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. మరోవైపు హాస్పిటల్ కు జ్యోత్స్న వెళ్లడంతో దీప ఆశ్యర్యపోతుంది. యాక్సిడెంట్ అయిన వీడు ప్రశాంతంగా ఉన్నాడు.. వీడిని కాపాడినట్టు బిల్డప్ ఇచ్చిన నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు.. కారు ఆపకుండా వెళ్లిపోయానని వాడు ఎవడో వీడియో తీసి సోషల్ మీడియాలో నన్ను ఛీ అనిపించాడని జ్యోత్స్న అనగానే.. ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అని దీప అంటుంది.
నీతో గొడవ పెట్టుకుంటే ఊరుకుంటారా.. ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి.. ఈ వీడియో కూడా ఎవడో ఒకడు ఎడిట్ చేసి మానవత్వంతో యాక్సిడెంట్ అయిన అబ్బాయిని కాపాడిన మహిళ మీద మిస్ హైదరాబాద్ దౌర్జన్యం అని రాస్తారు. యాక్సిడెంట్ అయ్యింది వీడికి కానీ డ్యామేజ్ జరిగింది నాకు అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ రావడంతో జ్యోత్స్న మాట మారుస్తుంది. మరోవైపు మనవడిని తలుచుకుని పారిజాతం బాధపడుతుంది. జ్యోత్స్న ను మరీ ఇలా పెంచావేంటని పారిజాతాన్ని ప్రశ్నిస్తాడు దాస్. మనిషి ప్రాణం పోయిన పట్టించుకోనంత దుర్మార్గంగా పెరిగిందని అడుగుతాడు. ఇంతలో పారిజాతం దగ్గరకి జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వచ్చావు పారు అని జ్యోత్స్న అడుగగా.. యాక్సిడెంట్ అయిన అబ్బాయిని చూసి వస్తానని పారిజాతం అంటుంది. వాడిని చూడాల్సిన అవసరమేంటని జ్యోత్స్న అనగానే. వాడు నీ అనేసి ఆగిపోతుంది. 'హా.. నా' ఏంటి అని జ్యోత్స్న అనగానే.. ఏదో కవర్ చేస్తుంది. ఇక కాశీ దగ్గరికి వెళ్ళిన పారిజాతం.. నన్ను క్షమించురా మనవడా, యాక్సిడెంట్ అయింది నీకని తెలిస్తే రోడ్డు మీద అలా వదిలేసి వెళ్లిపోయే దాన్ని కాదని మనసులో అనుకుంటుంది. ఇక తనని చూసిన కార్తీక్ డౌట్ పడతాడు. దగ్గరుండి వీడిని సొంత మనిషిలా చూసుకుంటున్నావు.. నువ్వు చాలా గ్రేట్ కార్తీక్ అని పారిజాతం అనగానే. నేను కాదు చూసుకుంటుంది దీప. కాపాడింది కూడా దీపే అని అంటాడు. దాంతో చాలా మంచి పని చేశావు దీప అని పారిజాతం మెచ్చుకుంటుంది.
మరోవైపు స్వప్న గురించి ఆలోచిస్తూ శ్రీధర్ కి ఫోన్ చేస్తుంది కావేరి. అప్పుడు కాంచన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. బేబీ ఎక్కడున్నావని కావేరి అనగానే. బేబి ఎవరు అని కాంచన అంటుంది. దాంతో వెంటనే కంగారుపడి కావేరి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత శ్రీధర్ వస్తాడు. బేబీ ఎవరని కాంచన అడగడంతో శ్రీధర్ ఫస్ట్ షాక్ అయి.. ఆ తర్వాత ఎవరో నాకేం తెలుసని మాట మారుస్తాడు. ఎవరో అర్థం పర్థం లేని వాళ్ళు ఇలా ఫోన్ చేస్తారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టిస్తారని కవర్ చేస్తాడు. మరోవైపు ఇంటికొచ్చిన దీపను సుమిత్ర మెచ్చుకుంటుంది. జ్యోత్స్న మాత్రం వెటకారంగా దీపను తిడుతుంది. నువ్వే ఆ వీడియో తీయించి ఉంటావని దీపను అనుమానిస్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.