English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్న పేరు మీద ఆస్తులు.. దీపకి తప్పిన గండం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -527 లో.. నేను రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు పెట్టి ల్యాండ్ తీసుకున్నాను.. అది అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను కానీ సిచువేషన్ అప్పుడు ఇలా లేదుగా అని జ్యోత్స్న అంటుంది. అది పచ్చి అబద్ధం అని కార్తీక్ అంటాడు. మళ్ళీ కవర్ చేస్తూ అలా అని పారు అనుకోవచ్చు కానీ అది నేను నమ్ముతున్నానని కార్తీక్ అంటాడు. మా మమ్మీ పేరున ఏది లేదు.. అందుకే ఇది తీసుకున్నానని జ్యోత్స్న అంటుంది. చూసారా జ్యోత్స్న వాళ్ళ అమ్మ గురించి ఎలా ఆలోచిస్తుందోనని పారిజాతం అంటుంది.

అదంతా వదిలెయ్యండి కానీ అలా కంపెనీ డబ్బు తియ్యడం కరెక్ట్ కాదని అలా ఇచ్చిన మేనేజర్ పై కంప్లైంట్ ఇవ్వాలని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. అదంతా కాదు మావయ్య ఆ ల్యాండ్ ని కంపెనీ ల్యాండ్ గా చూపిద్దామని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఇక అందరం భోజనం చేద్దాం పదండి అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. నిజంగానే తీసుకున్నావా ల్యాండ్ అని పారిజాతం అడుగుతుంది. అదేం లేదు నాకు కొన్ని ఆస్తులు ఉండాలి కదా అని అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దీప, కార్తీక్ వస్తారు మీరెందుకు వచ్చారని పారిజాతం అంటుంది. భోజనానికి పిల్వడానికి అని దీప అంటుంది. మరొక వైపు శ్రీధర్ వాళ్ళు భోజనం చేస్తుంటారు. వీళ్ళకి అసలు సిగ్గు లేదని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. భోజనం చేసాక శ్రీధర్ వెళ్లిపోతూ.. బావ నాకొక హెల్ప్ చెయ్యాలి. మీ చెల్లిని నన్ను నువ్వు కలపాలని దశరథ్ తో అంటాడు. అది పారిజాతం వింటుంది.

కొంచెం అయినా సిగ్గుండాలి అల్లుడు అని పారిజాతం అంటుంది. అందరు అప్పుడే వస్తారు. మా నాన్న ఏం చేసాడని ఆలా అంటున్నావని కార్తీక్ అంటాడు. ఇద్దరు పెళ్ళాలు కావాలంట అని పారిజాతం అంటుంది. దాంతో పారిజాతంపై శివన్నారాయణ కోప్పడతాడు. నువ్వు కావేరీని వదిలేయ్.. అప్పుడు నేనే దగ్గర ఉండి కలుపుతానని పారిజాతం అంటుంది. ఇక ఆ తర్వాత కాంచనని నేనే బ్రతిమిలాడుకుంటానని శ్రీధర్ వెళ్ళిపోతాడు. దీప గ్లాస్ తీసుకొని వెళ్తుంటే జ్యోత్స్న కాలు అడ్డుపెడుతుంది. దాంతో దీప పడిపోతుంటే సుమిత్ర పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.