English | Telugu

కార్తీక్ ని టెన్ష‌న్ పెడుతున్న రుద్రాణి.. దీప ఏం చేసింది?

`కార్తీక దీపం` బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు అత్యంత ఇష్ట‌మైన సీరియ‌ల్ గా విశేష ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ సీరియ‌ల్ ద్వారా న‌టీన‌టులు నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్‌, శోభాశెట్టి సెల‌బ్రిటీలుగా మారిపోయారు. అంత‌లా ఈ సీరియ‌ల్ పాపుల‌ర్ అయిపోయింది. టీఆర్పీ లోనూ అగ్ర భాగాన నిలుస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్ తో కొన‌సాగుతోంది. ప్ర‌తీ రోజు ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న `కార్తీక దీపం` ఈ మంగ‌ళ‌వారం కూడా స‌రికొత్త ట్విస్ట్ ల‌తో ఆక‌ట్టుకోబోతోంది.Also Read:రుద్రాణికి చుక్క‌లు చూపించిన మాధురి!

రుద్రాణి అప్పు తీరుస్తామ‌ని మాటిచ్చిన‌ కార్తీక్‌, దీప అందు కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తారు. దీప పిండి వంట‌లు చేస్తూ మ‌ళ్లీ వంట‌ల‌క్క అవ‌తారం ఎత్తేస్తుంది. ఇది గ‌మ‌నించిన రుద్రాణి... 'పిండి వంట‌లు చేస్తుందా..? వాటితో వ‌చ్చిన డ‌బ్బుల‌తో నా అప్పు తీసుస్తుందా?' అని ఆగ్ర‌హంతో ఊగిపోతూ వుంటుంది. ఎలాగైనా దీప‌ని ఆపాల‌ని, ఈ విష‌యంలో కార్తీక్ ని రెచ్చ‌గొడితే ఆ ప‌ని సులువు అవుతుంద‌ని ప్లాన్ చేస్తుంది. వెంట‌నే కార్తీక్ ఇంటికి వెళ్లి అత‌ను బాబుకు పాలు ప‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టంతో అత‌న్ని భ‌య‌పెట్ట‌బోతుంది.

Also Read:రుద్రాణి కుట్ర‌.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

'ఇంట్లో రంగ‌రాజుని బాగానే ఆడిస్తున్నావ్ కానీ బ‌య‌టికి వెళ్లిన నీ వాళ్ల ప‌రిస్థితి ఏంటీ?.. స్కూల్ కి వెళ్లిన నీ పిల్ల‌ల ప‌రిస్థితి ఏంటీ?' అంటూ కార్తిక్ ని ఎమోష‌నల్ బ్లాక్ మెయిల్ చేయ‌డం మొద‌లుపెడుతుంది. కార్తీక్ సీరియ‌స్ కావ‌డంతో అక్క‌డి నుంచి వెళ్లిన రుద్రాణి స్కూల్ లో వున్న కార్తీక్ పిల్ల‌ల వ‌ద్ద‌కు చేరుతుంది. అన్నం తిన‌మంటూ వారిని ఇబ్బంది పెడుతుంది. విష‌యం గ్ర‌హించిన కార్తిక్ వెంట‌నే అక్క‌డికి చేరుకుని రుద్రాణిని ఎదిరిస్తాడు. పిల్ల‌ల‌ని తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. దీప ఇంటికి రాక‌పోవ‌డంతో భ‌య‌ప‌డుతుంటాడు. కార్తీక్‌ని భ‌య‌పెడుతున్న రుద్రాణికి దీప ఎలాంటి గుణ‌పాఠం చెప్పింది? .. రుద్రాణి అప్పు తీర్చేసిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.