English | Telugu
అనసూయని తగులుకున్న కరాటే కల్యాణీ
Updated : May 5, 2022
తన సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియోపై దుమారం మొదలైంది. పబ్లిక్ లో న్యూ సెన్స్ క్రియేట్ చేస్తున్న పాగల్ సేన్ అంటూ దీనిపై టీవి 9 ఛానల్ డిబేట్లు పెట్టడంతో వివాదం మరింత ముదరింది. అయితే ఈ డిబేట్ కి ఆహ్వానించడంతో వెళ్లిన విశ్వక్ సేన్ కు డిబేట్ ని నిర్వహిస్తున్న యాంకర్ దేవి నాగవల్లికి మధ్య మాటల యుద్ధం జరిగింది. డిబేట్ లో పాల్గొన్న విశ్వక్ సేన్ ని డిప్రెస్డ్ పర్సన్ అని, అందుకే అతన్ని పాగల్ సేన్ అంటారంటూ అవమానించడంతో విశ్వక్ సేన్ లైవ్ లోనే తనపై సీరియల్ అయ్యాడు.
ఆ తరువాత ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వివాదానికి దారితీసింది. వెంటనే గెటౌట్ ఆఫ్ మై స్టూడియో అంటూ విశ్వక్‌సేన్ ని పదే పదే అనడంతో అతని డిబేట్ కోసం స్టూడియోకు పిలిచి ఇప్పుడు గెట్ ఔట్ అంటారా అంటూ `ఎఫ్` అనే పదం వాడాడు. ఇప్పడు ఇదే అతన్ని ఇరకాటంలో పడేసింది. ఆ తరువాత తన తొందర పాటుకు క్షమాపణలు చెప్పినా ఈ వివాదం సద్దుమనగడం లేదు. అయితే దీనిపై పూర్తి మద్దతు విశ్వక్ సేన్ కే లభిస్తోంది. నెటిజన్ లతో పాటు చాలా మంది సెలబ్రిటీలు కూడా విశ్వక్ సేన్ కే మద్దతుగా నిలుస్తున్నారు.
ఇప్పటికే `ఇంటింటి గృహలక్ష్మి` ఫేమ్ కస్తూరి మద్దుతు తెలపగా నటుడు రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ వేదికగా టివి9 పై వారి స్టాండ్ పై నిప్పులు చెరిగాడు. డబ్బుల కోసమే అంతా చేస్తుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ విశ్వక్ సేన్ కు అండగా నిలిచాడు. తాజాగా కరాటే కల్యాణి కూడా ఈ జాబితాలో చేరింది. ఫేస్ బుక్ వేదికగా కరాటే కళ్యాణి .. విశ్వక్ సేన్ కు మద్దతుగా నిలుస్తూనే యాంకర్, నటి అనసూయని తగులుకుంది. ఈ వివాదంలోకి అనసూయని కూడా లాగేసింది. టీవీ వర్సెన్ సేన్ లో పూర్తిగా టీవీ వాళ్లదే తప్పు. నేను ఆ హీరోకే సపోర్ట్ చేస్తా. అనసూయ ఎన్నోసార్లు `ఎఫ్` అనే పదం వాడినప్పుడు పక్కనే వున్న నువ్వు మెలికలు తిరుగుతూ ఆనందించావు కదా? అంటూ యాంకర్ దేవి నాగవల్లికి, అనసూయకు చురకలంటించింది కరాటే కల్యాణి.