English | Telugu
షన్ను బండారం బయటపెట్టిన కాజల్
Updated : Jan 6, 2022
బిగ్‌బాస్ సీజన్ 5 ముగిసినా దాని రచ్చ ఇంకా కంటిన్యూ అవుతూనే వుంది. ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్జే కాజల్ తాజాగా షన్నుబండారం బయటపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కావడమే తన కలగా భావించిన కాజల్ అనుకున్నట్టుగాను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన కలని నిజం చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్న ఈ షోలో కాజల్ తన ప్రత్యేకతని చాటుకుందనే చెప్పాలి. ఎంత మంది తనని హౌస్ నుంచి బయటికి పంపించాలని ప్రయత్నాలు చేసినా టాప్ 6లో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది.
హౌస్ లో కాజల్ ని చాలా మంది చాలా రకాలుగా ఆడుకున్నారు. యానీ మాస్టర్ అయితే తనని నాగిన్ అంటూ ఏడిపించే ప్రయత్నం చేసింది. ఇక షన్ను ఏకంగా కాజల్ బయటికి వెళితేనే హౌస్ లో గొడవలు తగ్గుతాయని స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు కూడా. ఇలా రక రకాల దాడుల తరువాత కాజల్ ఫైనల్ గా సన్నీ, మానస్ ల తో కలిసిపోయింది. ముందు షన్నుతో క్లోజ్ గా వున్నా తను కరెక్ట్ కాదని తెలియడంతో సన్నీ, మానస్ ల తో గ్రూప్ కట్టేసింది.
బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ చాలా మంది హౌస్ లో జరిగిన విషయాలపై ఓపెన్ అవుతుంటే కాజల్ చాలా లేట్ గా రియాక్ట్ అయింది. ఈ సందర్భంగా షణ్ముఖ్ అసలు బండారం బయటపెట్టింది. హౌస్ లో షన్ను ఎలా వుండేవాడు, తనతో ఏమన్నాడు?.. ముందు తనతో వున్న కాజల్ ఎందుకు సన్నీ, మానస్‌ల వద్దకు చేరాల్సి వచ్చిందో మొత్తానికి బయటపెట్టేసింది.
Also read:నెటిజన్ ప్రశ్నకి యానీ ఆన్సర్ అదిరింది
నేను నా రియల్ లైఫ్ లో ఎలా వుండేదాన్నో హౌస్ లోనూ అలాగే వున్నాను. నాకు ఏది అనిపిస్తే అదే చేశా. షణ్ముఖ్ కు ఫాలోయింగ్ వుందని అతన్ని ముందు ఫాలో కాలేదు. స్టార్టింగ్ లో అలా కనెక్ట్ అయ్యా. అప్పుడు షన్ను ఏమన్నాడంటే .. నువ్వు వుంటే నాతో మాత్రమే వుండాలి.. అందరితో ఉంటూ నాతో వుంటే నాకు ఇష్టం వుండదు.. దాన్ని నేను తీసుకోలేను.. నువ్వు నాతోనే వుండాలి అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అది నాకు నచ్చలేదు. నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ వుంది. కాబట్టే అతనికి దూరంగా వున్నాను` అంటూ షన్ను బండారం బయటపెట్టింది కాజల్.