English | Telugu

జోర్దార్ సుజాత చేతిలో రాకింగ్ రాకేశ్ బ‌క‌రా!‌

జోర్దార్ సుజాత గుర్తుందిగా.. బిగ్ బాస్ సీజ‌న్ 4తో లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసింది. టీవీ ఛాన‌ల్‌లో స‌బ్ యాంక‌ర్‌గా కెరీర్ మొద‌టుపెట్టిన జోర్ద‌ర్ సుజాత బిగ్ ‌బాస్ సీజ‌న్ 4తో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్ప‌డు ప‌లు టీవీ షోల్లో పాల్గొంటూ ప్ర‌స్తుతం య‌మ బిజీగా వుంటోంది. యూట్యూబ్ ఛాన‌ల్స్ నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల్లోనూ జోర్దార్ జుజాత త‌న స‌త్తా చాటుకుంటోంది.

బిగ్ బాస్‌ షోలో నాగ్‌ని బిట్టూ అంటూ హంగామా చేసిన సుజాత ఆ కార‌ణంగానే హౌ‌స్ నుంచి నాగ్ ఫ్యాన్స్ కార‌ణంగా నిష్క్ర‌మించాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల జబ‌ర్ద‌స్త్ రాకింగ్ రాకేష్‌తో ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కి ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చేసింది. ఆ చాన‌ల్ ఎవ‌రిదో కాదు.. రాకేశ్‌దే. దాని పేరు "చంట‌బ్బాయి". 'జోర్దార్ సుజాత హోమ్ టూర్' అనే పేరుతో నిర్వ‌హించిన ఈ టాక్ షోలో రాకింగ్ రాకేష్‌కి దిమ్మ‌దిరిగే పంచ్ ఇచ్చి బ‌క‌రాని చేసేసింది.

కోట్లు ఖ‌రీదు చేసే ఇల్లు, ల‌గ్జ‌రీ లైఫ్‌ని లీడ్ చేస్తున్న‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చిన జోర్ద‌ర్ సుజాత చివ‌రికి పెద్ద ట్విస్ట్ ఇచ్చేసింది. ‌ఖ‌రీదైన ఇంట్లో జోర్దార్‌ సుజాత ఇంట‌ర్వ్యూ జ‌రిగింది. అయితే ఆ ఇల్లు సుజాత‌దే అని భ్ర‌మ‌ప‌డిన రాకింగ్ రాకేష్ ఆ త‌రువాత ఆ ఇల్లు సుజాత‌ది కాద‌ని తెలిసి షాక‌య్యాడు. సుజాత చేతిలో బక‌రా అయిపోయాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.