English | Telugu

సీక్రెట్ ల‌వ్‌లో బిగ్‌బాస్ జోడీ..?

లాక్‌డౌన్ కార‌ణంగా బిగ్‌బాస్ సీజ‌న్ 4 కొంత ఆల‌స్యంగా మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే ఈ షోలో పాల్గొ‌న్న వాళ్ల‌లో చాలా వ‌ర‌కు యూట్యూబ్‌లో పాపుల‌ర్ అయిన వాళ్లే అయినా బుల్లితెర‌కు చాలా కొత్త ముఖాలు. దీంతో షో ప్రారంభ రోజుల్లో చాలా వ‌రకు నెగెటివ్ టాక్ వినిపించింది. త‌రువాత బిగ్ బాస్ నిర్వాహ‌కులు వేసిన ల‌వ్ ట్రాక్ మంత్రాతో సీజ‌న్ ‌4 గాడిలో ప‌డి కొత్త వొర‌వ‌డిని సృష్టించింది.

ముఖ్యంగా మోనాల్‌, అఖిల్‌ల ప్రేమాయ‌ణం ఈ షోలో ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది. ముందు అభిజీత్‌తో పులిహోరక‌ల‌పాల‌ని మోనాల్ ట్రై చేసింది. మోనాల్ డ‌బుల్ ట్రాక్ అర్థం కావ‌డంతో అభిజీత్ త‌న పంథాని మార్చుకుని మోనాల్‌ని దూరం పెట్టాడు.. అప్పుడు అఖిల్‌ని లైన్‌లోకి దించేసింది మోనాల్. వీరిద్ద‌రి ప్రేమాయ‌ణం సీజ‌న్ ఎండ్ వ‌ర‌కు ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు, గిల్లిక‌జ్జాల‌తో సాగి హాట్ టాపిక్‌గా మారిపోయింది.

టాప్ 5కి ముందే మోనాల్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది. అఖిల్ మాత్రం ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లి ర‌న్న‌ర‌ప్‌గా మిగిలిపోయాడు. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం సీజ‌న్ 4 అయిపోయినా ఇంకా న‌డుస్తూనే వుంద‌ట‌. ఈ విష‌యం 'బిగ్‌బాస్ ఉత్స‌వం'పేరుతో శ్రీ‌ముఖి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కార్య‌క్ర‌మంలో గ‌త ఆదివారం ప్ర‌సా‌ర‌మైన ఎపిసోడ్‌లో బ‌ట్ట‌బ‌య‌లైంది.

గంగ‌వ్వ‌, శ్రీ‌ముఖి వీరి సీక్రెట్ ల‌వ్‌స్టోరీని బ‌య‌ట‌పెట్టేశారు. దీన్ని నిజం చేస్తూ మోనాల్ గంగ‌వ్వ‌కు చీర పెట్టేసింది. "దీన్ని ఎప్పుడు క‌ట్టుకుంటావ్ మోనాల్.. పెళ్లికా?" అ‌ని శ్రీ‌ముఖి అడిగితే "ఎందుకు? అఖిల్ కొనిస్తాడు"అంటూ అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేసింది గంగ‌వ్వ. అంటే అఖిల్‌, మోనాల్ ల‌వ్ ట్రాక్ నిజ‌మేన‌న్న మాట‌. మ‌రి ఆ ట్రాక్ నిజంగానే పెళ్లి దాకా వ‌స్తుందా? చూడాలి..

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.