English | Telugu

అస‌లే చిట్టి స్కర్టు... ఇంకేం తగ్గించాలని వ‌ర్షిణి కౌంటర్!

టీవీ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ల లిస్టు తీస్తే... అందులో రష్మీ గౌతమ్, వర్షిణీ సౌందర్‌రాజన్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ఒకప్పుడు వీళ్ళిద్దరూ 'ఢీ' షోలో కనిపించేవారు. 'ఢీ' లేటెస్ట్ సీజన్‌లో వర్షిణిని పక్కనపెట్టి దీపికను తీసుకోవడంతో హాట్ యాంకర్ జోడీ ఒకే స్టేజిపై కనిపించి చాలా రోజులైంది. మళ్ళీ వీళ్ళిద్దర్నీ ఒక్క స్టేజి మీదకు తీసుకొచ్చాడు ఓంకార్.

ఓంకార్ హోస్ట్ చేస్తున్న 'సిక్త్స్ సెన్స్' సీజన్4 అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో రష్మీ, వర్షిణి సందడి చేయనున్నారు. షోలో ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతునప్పుడు వర్షిణి మాట్లాడుతున్న సమయంలో 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అని ప్రకాష్ రాజ్ డైలాగ్ వేశారు. వెంటనే 'ఏం తగ్గించుకోవాలి? ఆల్రెడీ ఇంత తగ్గించుకుని వచ్చా. ఇంకేం తగ్గించాలి?' అని తాను వేసుకున్న స్కర్టు సైజును చూపిస్తూ వర్షిణి సెల్ఫ్ సెటైర్ వేసుకుంది. పక్కన ఉన్న రష్మీ ఒక్కసారిగా నవ్వింది.

లేటెస్టుగా ఈ ప్రోమో విడుదలైంది. అందులో చివరగా మాస్ డాన్స్ తో రష్మీ, వర్షిణి ఒక ఊపు ఊపేశారు. ముఖ్యంగా చిట్టి స్కర్టులో వర్షిణి వేసిన డాన్స్ హైలైట్ గా నిలిచింది.

'మీరు చిలిపిగా నవ్వితే మల్లెపూల సునామీ...
చూపుల బాణం వదిలితే కుర్రకారు గుండెల్లో యమ్మీ యమ్మీ
అందుకే మీరంటే అందరికీ ఇష్టం రష్మీ' అంటూ ఓంకార్ వినిపించిన కవిత కూడా హైలైట్.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.