English | Telugu

Jayam serial : పారు ప్లాన్ అదేనని రుద్ర కనిపెడతాడా.. గంగ షాక్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -108 లో..... పారుకి రుద్రతో పెళ్లి చెయ్యాలని శకుంతల నిర్ణయం తీసుకొని పారుని ఒప్పిస్తుంది. అదంతా రుద్రపై ప్రేమతోనో ఇష్టంతోనో కాదు.. ఈ రుద్ర ఎక్కడ గంగని పెళ్లి చేసుకుంటాడో అన్న స్వార్థంతో శకుంతల ఆలోచిస్తుంది కానీ రుద్ర మాత్రం తన పెద్దమ్మ తనని క్షమించిందని నమ్ముతున్నాడు. ఇక పెళ్లి కూతురు పారు అని తెలిసి ఇంట్లో వాళ్లంతా వద్దని అంటారు.

రుద్ర నువ్వు ఎంత నన్ను ఇష్టపడ్డావో.. నేను నిన్ను అంతగానే ఇష్టపడ్డను కానీ నువ్వు నా కోసం రాలేదని కోపంతో నీకు ఎదురు వచ్చాను అంతే అని పారు యాక్టింగ్ చేస్తుంది. పారు ఎంత చెప్పినా ఇంట్లో అందరు వద్దని అంటారు. అందరు ఆగండి.. ఈ పెద్దమ్మ ఏం చేసిన రుద్ర మంచి కోసమే.. మీరందరు కాదు నిర్ణయం తీసుకోవాల్సింది రుద్ర తీసుకోవాలి. చెప్పు రుద్ర అని శకుంతల అడుగుతుంది. ఈ పెళ్లి నాకు ఇష్టమే అని రుద్ర అన్నాడు. దాంతో అందరు షాక్ అవుతారు. శకుంతల, పారు మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. శకుంతల వెంటనే తాంబులాలు మారుస్తుంది. గంగ నువ్వు ఎప్పుడు ఇక ఇంటికి కోడలు కాలేవని శకుంతల అనుకుటుంది. రుద్ర నన్ను పెళ్లి చేసుకున్నాక నీ అకాడమీ, నిన్ను నా గ్రిప్ లో పెట్టుకుంటానని పారు అనుకుంటుంది.

ఆ తర్వాత పారు, ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఇదంతా మీ వళ్లే సాధ్యం అయిందని పారు వాళ్లిద్దరికి థాంక్స్ చెప్తుంది. పెళ్లి అయ్యాక నాకొక గది సపరేట్ కావాలని పారు అనగానే రుద్ర బావ గది ఉంది కదా అని ఇషిక అంటుంది. నాకు ప్రైవసీ కావాలి అందుకేనని పారు అంటుంది. మరొకవైపు రుద్ర దగ్గరికి ప్రీతి వచ్చి ఎందుకు అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకున్నావని అడుగుతుంది. అప్పుడే పారు వచ్చి‌ రుద్రని బయటకి తీసుకెళ్తుంది. కాసేపటికి గంగ టిఫిన్ సెంటర్ దగ్గర పని చేస్తుంటే పారు వచ్చి పొగరుగా మాట్లాడుతుంది. అక్కడున్న కస్టమర్స్ బిల్లు మొత్తం తనే కడతానని పారు చెప్పగానే.. ‌డబ్బు ఎక్కువగా ఉంటే అనాధాశ్రమంకి వెళ్లి డొనేట్ చేసుకోమని గంగ అంటుంది. అదేం కాదు.. నాకు పెళ్ళి ఫిక్స్ అయిందని పారు అంటుంది. ఎవరో ఆ బలిపశువు అని గంగ అనగానే.. రుద్రని చూపిస్తుంది పారు. దాంతో గంగ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.