English | Telugu
రౌడీ శౌర్య షేర్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా!
Updated : Mar 15, 2021
స్టార్ మాలో ప్రసారం అవుతున్న నంబర్ వన్ తెలుగు సీరియల్ 'కార్తీకదీపం'. ఈ సీరియల్‌లో వంటలక్క దీపగా నటించిన కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అదే స్థాయిలో ఈ సీరియల్‌లో దీప కూతురు శౌర్యగా నటించిన బేబీ కృతిక కూడా అంతే పాపులర్ అయింది. తన చిట్టి పొట్టి మాటలతో ఆకట్టుకుంటున్న కృతిక తాజాగా చేసిన పనికి నెటిజన్‌లు ఫిదా అయిపోయారు.
శభాష్ రౌడీ అంటూ కృతికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుల్లితెరపై రాణిస్తున్న ఈ రౌడీ బేబీలో సామజిక స్పృహ ఎక్కువే. ఈ వయసులోనే నలుగురికి సాయపడాలని గొప్ప మనసుని చాటుకుంటోంది. వివిధ సేవా కార్యక్రమాలతో పాపులర్ అయి తనలోని సేవా నిరతిని చాటిన కృతిక తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని అందించింది.
రానున్న ఎండల్ని దృష్టిలో పెట్టుకుని పక్షులకు పరిపడా నీరు, ఆహారం అందేలా మీ టెర్రెస్‌పై ఏర్పాటు చేయండని సందేశాన్ని అందిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ చిన్నారి ఆలోచనకు మెచ్చిన నెటిజన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఇంత చిన్న వయసులో ఎంత సామాజిక స్పృహ అంటూ కృతికపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.