English | Telugu

బుర్జ్ ఖలీఫా దగ్గర సుజాతతో కలిసి సందడి చేసిన రాకేష్!


జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ లైం లైట్ లోకి వచ్చారు..అలాంటి వాళ్లలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఐతే ఈ షో చాలా మంది స్క్రీన్ పెయిర్స్ గా ఆడియన్స్ ని అలరిస్తూ ఉన్నారు. రాకేష్ కూడా తన జోడి సుజాతతో కలిసి అలాగే ఎంటర్టైన్ చేసేవాడు. ఐతే మొదట అందరూ కూడా స్క్రీన్ కోసం నటిస్తున్నారు అనుకున్నారు కానీ తర్వాత తమ ప్రేమ రీల్ కాదు రియల్ అని లవ్ ప్రొపోజ్ చేసి మరీ చూపించాడు. పెళ్లి కాకుండానే ఎన్నో షోస్ లో రియల్ భార్యాభర్తల్లా వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు.

ఇక ఇప్పుడు ఇద్దరూ టూర్స్ కూడా వెళ్లిపోతున్నారు. రీసెంట్ గా దుబాయి వెళ్లిన ఈ జోడీ.. బూర్జ్ ఖలీపా టవర్ ముందు తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీళ్ళు ఈవెంట్ కోసం వెళ్లారా ? పర్సనల్ ట్రిప్ప అనే విషయం తెలీదు. ఇక వీళ్ళిద్దరూ ‘జబర్దస్త్’తో పాటు ‘మిస్టర్ అండ్ మిసెస్’ షోలోనూ జంటగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటున్నాం అని అనౌన్స్ కూడా చేశారు. మరి వీళ్ళు పెళ్ళెప్పుడు చేసుకుంటారో వేచి చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.