English | Telugu

ప్రభాస్ ఎపిసోడ్ విషయంలో ఆహా సంచలన నిర్ణయం!

పాన్ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్‌ రీసెంట్‌గా ఓటీటీ వేదిక ఆహాలో నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న‌ పాపుల‌ర్ టాక్ షో 'అన్‌స్టాప‌బుల్‌'లో పార్టిసిపేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లై అందరిని ఆకర్షించింది. ఇటు బాల‌కృష్ణ, అటు ప్ర‌భాస్‌, గోపీచంద్‌ల ఫ్యాన్స్ కి ప‌ర్‌ఫెక్ట్ విందు భోజ‌నంలాంటి ఎపిసోడ్‌ ను సిద్ధం చేసినట్లు ఆహా తెలిపింది. ఇందులో ప్ర‌తి క్ష‌ణం ఎంతో విలువైన‌దేనని, దాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆస్వాదించాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఈ బాహుబ‌లి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ విషయన్ని తాజాగా ప్రేక్షకులతో ఆహా పంచుకుంది.

'బాహుబలి' చిత్రం మొదటి భాగానికి 'ది బిగినింగ్', రెండో భాగానికి 'ది క‌న్‌క్లూజ‌న్' అని పెట్టినట్లుగా.. ఆహా కూడా 'అన్‌స్టాప‌బుల్ 2 విత్ ఎన్‌బీకే'లో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి అవే పేర్లు పెట్టింది. 100 నిమిషాల నిడివి ఉన్న బాహుబలి ఎపిసోడ్‌ని.. ది బిగినింగ్ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబ‌ర్ 30న, క‌న్‌క్లూజ‌న్ పేరుతో రెండో భాగాన్ని జ‌న‌వ‌రి 6న ప్ర‌సారం చేయనున్నారు.

'అన్‌స్టాప‌బుల్' హిస్ట‌రీలో ఓ ఎపిసోడ్‌ను రెండు ఎపిసోడ్స్‌గా అందించ‌టం ఇదే మొద‌టిసారి. కొత్త సంవ‌త్స‌రం ట్రీట్‌గా డిసెంబ‌ర్ 30న ప్ర‌సారం కాబోయే తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుందట. ఇక డిసెంబ‌ర్ 6న ప్ర‌సారం కాబోయే రెండో ఎపిసోడ్‌లో ప్ర‌భాస్‌ తో పాటు ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్ కూడా సందడి చేయనున్నాడు. ఇందులో ప్ర‌భాస్‌, గోపీచంద్ కెరీర్ ఇండ‌స్ట్రీలో ఎలా ప్రారంభ‌మైంది. వారి స్నేహం ఎలా ప్రారంభ‌మైంది.. ఇన్నేళ్ల‌లో ఎలా బ‌ల‌ప‌డింది అనే విష‌యాలుంటాయట. ఈ రెండు ఎపిసోడ్స్ లో ఎవ‌రూ ఊహించ‌ని కొత్త విష‌యాలు, అంత‌కు మించిన ఫ‌న్ ఉంటుందని ఆహా టీమ్ చెబుతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.