English | Telugu

సీక్రెట్ గా పవిత్ర కి మళ్ళీ పెళ్లి!

పాగల్ పవిత్ర.. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న అమ్మాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్ ద్వారా ఫేమ్ వచ్చిన వారు చాలానే ఉన్నారు. వారిలో పవిత్ర ఒకరు. జబర్దస్త్ మొదట్లో అబ్బాయిలే లేడీ గెటప్ వేసి కామెడీని పండించేవారు కానీ ప్రస్తుతం అబ్బాయిలకు గట్టి పోటీ ఇస్తూ అమ్మాయిలు కూడా జబర్దస్త్ స్కిట్స్ చేస్తూ కామెడీ చేస్తున్నారు. ఈ కోవకి చెందినవాళ్లే రౌడీ రోహిణి, ఫైమా, పాగల్ పవిత్ర. వీళ్లంతా జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

పాగల్ పవిత్ర టిక్ టాక్ ద్వారా పాపులారిటీ తెచ్చుకొని జబర్దస్త్ లో అడుగుపెట్టింది. అంతకు ముందు సీరియల్స్ లో చిన్న చితక పాత్రలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. దాంతో జబర్దస్త్ లోకి వచ్చి తన కామెడీతో జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వులు పూయించింది. జబర్దస్త్ వల్లే పవిత్రకి గుర్తింపు వచ్చింది. తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్న పవిత్ర.. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే పవిత్ర సూపర్ క్వీన్ సీజన్-2 లో కంటెస్టెంట్ గా చేస్తోంది. అయితే ఆ షోకి సంబంధించిన మేనేజ్ మెంట్ తనకి ఒక టాస్క్ ఇచ్చారంట.. అదేంటంటే నువ్వు సడన్ గా పెళ్లి చేసుకొని మీ అమ్మా దగ్గరికి వెళ్తే.. మీ అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పారంట.. అందులో భాగంగానే పవిత్ర పెళ్లి చేసుకొని వచ్చినట్లు తెలుస్తోంది. పవిత్ర వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళగానే.. తనని పెళ్లి కూతురు గెటప్ లో చూసి.. " పెళ్లి చేసుకుంటున్నానని నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా" అని వాళ్ళ అమ్మ అనగానే పవిత్ర ఎమోషనల్ అయింది. నీ కళ్ళ ముందు నీ కూతురు ఇలా నిలబడి ఉంటే నీకు కోపం రావడం లేదా అని వాళ్ళ అమ్మతో పవిత్ర అనగానే.. ఏం లేదని అంది.. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇదంతా ఫ్రాంక్ అని వాళ్ళ అమ్మతో పవిత్ర చెప్పింది.

గతంలో కూడా ఇలా పెళ్ళి చేసుకున్నట్లు ఫ్రాంక్ చేసి అందరిని నమ్మించింది పవిత్ర. రెండవ సారి 'మళ్ళీ పెళ్లి' అని తన యూట్యూబ్ ఛానల్ లో వ్లాగ్ చేసి అప్లోడ్ చేసింది పవిత్ర. కాగా ఆ వీడియో చూసిన నెటిజన్లు.. పవిత్ర మళ్ళీ పెళ్లి చేసుకుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే పవిత్ర ఇప్పటికే పలు సీరియల్స్ లో చేస్తుంది. కాగా ఒకవైపు ఈవెంట్స్, మరొకవైపు జబర్దస్త్ లతో బిజీ బిజీ గా గడుపుతుంది పవిత్ర.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.