English | Telugu

ఇవన్నీ చూసాక నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది కదా..

గొడుగు పట్టి స్నాక్స్ తినిపిస్తూ సెట్ లోకి తీసుకొచ్చేసరికి " స్టెల్లా ఇండియాకి ఎప్పుడొచ్చావు..ఇంతకు మీ ఆయన రాజు ఎక్కడ" అని ప్రదీప్ అడిగాడు. "కనిపిస్తలేదా అన్నా అని చూపించింది ..ఏంటి రాజులా ఉండేవాడివి బంటులా ఇపోయావ్" అని డైలాగ్ వేసాడు. "చెమటలు పడుతున్నాయి. ఫ్యాన్ పెట్టు" అని స్టెల్లా అనడంతో "నువ్వు ఎంతో మంది ఫాన్స్ ని సంపాదిస్తావ్ అనుకున్నా కానీ ఈ ఫ్యాన్ ని సంపాదించావా" అన్నాడు ప్రదీప్. తరువాత సెట్ కి జోర్దార్ సుజాత తన భర్త రాకింగ్ రాకేష్ కి గొడుగు వేసి మరీ తీసుకొచ్చింది.

గొడుగు సరిగా పట్టుకోకపోయేసరికి "నీకన్నీ నేర్పించాలా..గొడుగు పట్టుకోవడం కూడా రావడం లేదు...కొడితే మళ్ళీ అని గట్టిగా అనేసరికి ప్రదీప్ షాకయ్యాడు. తర్వాత రాకేష్ కళ్ళు పైకి పెట్టేసరికి సుజాత దణ్ణం పెట్టుకుంది .. అది చూసిన యాదమ్మ రాజు కూడా కాలు లేపి పైకి పెట్టాడు. స్టెల్లా కూడా పోటీగా కాలు లేపి నిలబడింది. అక్కడ జరిగిందంతా చూసేసరికి "ఏంటి ఈ చేంజ్ ఓవర్" అన్నాడు ప్రదీప్ .." ఇవన్నీ చూసాక నీకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది కదా" అని రాకేష్ అడిగేసరికి "లేదు ఇంటికి వెళ్ళాక నీ పరిస్థితి ఏమిటా" అని ఆలోచిస్తున్నా అన్నాడు ప్రదీప్. "ఏ, బి, సి లెటర్స్ తో స్టార్ట్ అయ్యే రాష్ట్రాల పేర్లు చెప్పండి" అని ప్రదీప్ క్వశ్చన్ వేసేసరికి "చండీగఢ్, బొంబాయి, బాంగ్లాదేశ్, ఆంధ్ర, తెలంగాణా" అని స్టెల్లా చెప్పిన ఆన్సర్ కి ప్రదీప్ ఫేస్ రియాక్షన్స్ మాములుగా లేవు..

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.