English | Telugu

సుడిగాలి సుధీర్ ఇంట్లో రోజూ నాలుగు షోలు.. ఏమాక‌థ‌?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. క‌డుపుబ్బా న‌వ్విస్తూ హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, ఆటో రామ్ ప్ర‌సాద్, గెట‌ప్ శ్రీ‌ను చేస్తున్న‌ స్కిట్ లు హాస్య ప్రియుల్ని అల‌రిస్తున్నాయి. న‌టి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, ప్ర‌ముఖ గాయకుడు మ‌నో ఈ కార్య‌క్ర‌మానికి జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అప్పుడ‌ప్పుడు టీమ్ లీడ‌ర్ లు వేసే పంచ్ ల‌కు రోజా, మ‌నో కూడా రివర్స్ పంచు లేస్తూ కామెడీ చేస్తున్నారు. ఈ గురువారం తాజా ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. ఎప్ప‌టి లాగే సుడిగాలి సుధీర్, హైప‌ర్ ఆది ఓ రేంజ్ లో ర‌చ్చ చేయ‌బోతున్నారు.

దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని విడుద‌ల చేశారు. రెట్రో లుక్ కాన్సెప్ట్ తో 80`s గెట‌ప్ ల‌తో హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకే క‌ల‌ర్ డ్రెస్సుల్లో క‌నిపించి న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్. "అన్న‌య్యా ర‌ష్యాలో త‌ప్పులు చేస్తే శిక్ష‌లు వేరుగా వుంటాయి క‌దా?" అని అడిగాడు హైప‌ర్ ఆది. "అవును.. నీకెలా తెలుసు?" అన్నాడు సుడిగాలి సుధీర్.. "అంద‌రికి గుండు గీస్తే నీకేంటీ మీసాలు గ‌డ్డాలు గీసేశారేంటీ అన్నయ్యా?" అని పంచ్ వేశాడు హైప‌ర్ ఆది.

Also Read:రెండో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌

దీనికి నొచ్చుకున్న సుడిగాలి సుధీర్ "అలా అంటావేంట్రా ఇప్ప‌టికే డేట్స్ కుద‌ర‌క నీతో `ఢీ`చేయ‌ట్లేద‌ని ఎంత బాధ‌ప‌డుతున్నానో తెలుసా?" అన్నాడు. "ఆ డేట్స్ లో నువ్వు ఎక్క‌డెక్క‌డ ఢీ కొడుతున్నావో నేనెంత బాధ‌ప‌డుతున్నానో నీకు తెలుసా?" అని హైప‌ర్ ఆది మ‌ళ్ళీ పంచ్ వేశాడు. "నువ్విలా అన్నావంటే `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌.. ఇలా మూడు షోలు మానేస్తా" అన్నాడు సుడిగాలి సుధీర్.. వెంట‌నే "ప్లీజ్ మానేయొద్ద‌న్న‌య్యా.." అన్నాడు హైప‌ర్ ఆది.

అయితే అది విన్న సుధీర్ "ఎందుకురా నేనంటే ఇంత ప్రేమ వీడికి" అంటూ న‌వ్వేశాడు. ఆ న‌వ్వు ముగిసే లోపే హైప‌ర్ ఆది.. సుడిగాలి సుధీర్‌కు ఫ్యూజులౌట‌య్యే పంచ్ వ‌దిలాడు... "ఈ మూడు షోలు మానేసి ఇంట్లో ఏకంగా రోజుకు నాలుగు షోలు స్టార్ట్ చేస్తావేమో" అని పంచ్ వేసేస‌రికి అక్క‌డున్న వారంతా గొల్లున న‌వ్వేశారు. న‌వ్వులు పూయిస్తున్న ఈ ఎపిసోడ్ వ‌చ్చే గురువారం ప్ర‌సారం కానుంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.