English | Telugu

'ఛీ పోరా నీకు ముద్దిచ్చేదేంటి' అని ఆదిని పక్కకు తోసేసిన యాంకర్ సౌమ్య!

బుల్లితెర మీద సుదీర్ఘ కాలంగా ప్రసారమవుతున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ షో అప్పటికీ ఇప్పటికీ ఒకే రకమైన రెస్పాన్స్‌ను అందుకుంటూ వస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు కౌంటర్ పంచులు కూడా టపటపా పేలుతూ ఉంటాయి.

ఇక ఈ వారం స్కిట్ లో హైపర్ ఆది ఆది టీమ్ లో సీరియల్ యాక్టర్ అమరదీప్ కూడా వచ్చాడు. నాటీ నరేష్ కి ఆది అల్లుడు క్యారెక్టర్ చేసాడు. దొరబాబు ఆదికి పని వాడిగా చేసేసు. ఇంతలో గొడుగేయ్యమంటూ దొరబాబుని అడిగాడు ఆది. "ఎక్కడి నుంచి వస్తార్రా మీరంతా చెప్తే గాని పనిచేయడం లేదు" అని సెటైర్ వేసేసరికి దొరబాబు ఆది ఫేస్ కనిపించకుండా గొడుగు అడ్డుపెడతాడు. "ఏంట్రా టీమ్ లీడర్ ని కనిపించకుండా చేసేసి నువ్వు టీం లీడర్ ఇపోదామని చూస్తున్నావా" అని ఆది అనేసరికి వెనక నుంచి నాటీ నరేష్ "అందరూ నీలా ఉండరు కదా అల్లుడు" అని కౌంటర్ డైలాగ్ వేసాడు. ఇంతలో ఈ స్కిట్ లో వాళ్లంతా స్టేజి మీదకు వచ్చారు. అందులో లేడీ గెటప్స్ లో శాంతి స్వరూప్, రైజింగ్ రాజు వాళ్ళ మధ్యలో యాంకర్ సౌమ్యరావు కూడా ఉంది.

ఆది వాళ్లందరినీ చూసి యాంకర్ ఎవరో తెలియడం లేదు అన్నాడు దాంతో అందరూ నవ్వేశారు. ఇంతలో రైజింగ్ రాజు అమరదీప్ ని చూపిస్తూ "మా బావ ప్రతాపం చూస్తారా..బావా ఒక ముద్దు పెట్టావా " అని అడిగాడు. సౌమ్య ఆదిని చూపించి మా బావ ప్రతాపం చూస్తారా"అని కౌంటర్ వేసేసరికి " సౌమ్య నువ్వు కూడా నన్ను ముద్దు పెట్టమని అడగవా " అని ఆది అనేసరికి సౌమ్య సిగ్గుపడుతూ "ఛీ పోరా" అనేసింది.

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.