English | Telugu

హైపర్ ఆది మాకు గాడ్‌.. దొర‌బాబు భార్య కామెంట్‌!

'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన చేసే కామెడీ, వేసే పంచ్ లు అతడికి విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చాయి. బుల్లితెరపై తనదైన కామెడీతో హల్చల్ చేస్తోన్న హైపర్ ఆది.. తన షోలలో మహిళలను, లేడీ యాంకర్స్ ను టార్గెట్ చేస్తూ పంచ్ లు వేస్తుంటాడు. ఒక్కోసారి ఈ పంచ్ లు శృతి మించడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే హైపర్ ఆది టీమ్ లో పని చేసే దొరబాబు, పరదేశీ అనే ఇద్దరు కమెడియన్లు గతంలో వ్యభిచారం కేసులు పట్టుబడిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఆ సంఘటన జరిగి ఏడాది దాటేసినా.. ఇప్పటికీ హైపర్ ఆది తన స్కిట్ లలో వారిని ఉద్దేశిస్తూ పంచ్ డైలాగ్స్ వేస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ షోలో దొరబాబు తన భార్య అమూల్యతో కలిసి కనిపించాడు. ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించిన సుడిగాలి సుధీర్.. దొరబాబుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని అతడి భార్యని అడగగా.. తన ఇంట్లో వాళ్ళు దొరలాంటి వాడిని పెళ్లి చేసుకోమని చెబితే.. దొరలాంటి వాడు ఎందుకని దొరబాబునే పెళ్లి చేసుకున్నానంటూ పంచ్ వేసింది.

ఇది విన్న హైపర్ ఆది.. 'నీకు టిక్ టాక్ లో అంత ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్ధమైంది' అంటూ కౌంటర్ వేశాడు. ఇక ఆ తరువాత అమూల్య మాట్లాడుతూ.. 'మేము కష్టాలలో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోలేదు. ఇక మాకెవరూ లేరని అనుకున్న సమయంలో హైపర్ ఆది ముందుకొచ్చారు. మాకు సాయం చేసి ఆదుకున్నారు. అందుకే ఆయన నెంబర్ ను మా ఫోన్ లో గాడ్ అని సేవ్ చేసుకున్నాం' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.