English | Telugu

సౌమ్యకి ముద్దులిచ్చిన పంచవన్నెల రామచిలుక క్యాండీ

జబర్దస్త్ కు కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్య రావు. ఈమె కన్నడ అమ్మాయి. రష్మీ ప్లేస్ లో ఇప్పుడు ఈమె వచ్చి రాని తెలుగుతోనే యాంకరింగ్ చేస్తూనే హైపర్ ఆది మీద పంచుల వర్షం కురిపిస్తోంది. ఈమెకు కౌంటర్లు వేయడమే కాదు రంగురంగుల పంచవన్నె చిలకతో కబుర్లు చెప్పడం కూడా వచ్చు అని తెలుస్తోంది. సౌమ్య సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గానే కనిపిస్తోంది. పసుపు రంగు చీరలో మురిసిపోయిన ఈ చిలక అదే పసుపు రంగులో ఉన్న మరో చిలకతో కలిసి చిల్ అవుతోంది. ఆ చిలక పేరు క్యాండీ.."క్యాండీ ఓయ్ క్యాండీ ఎటు చూస్తున్నావ్" అని సౌమ్య మాట్లాడుతున్నంత సేపు క్యాండీ కూడా ఆమె అందానికి ఫిదా ఐపోయిందనుకుంటా అలాగే చూస్తూ ఉండిపోయింది.

ఇక సౌమ్య దానికి ముద్దు ఇవ్వబోతే క్యాండీ కూడా సౌమ్యకి ముద్దు ఇవ్వడానికి ట్రై చేసింది. ఈ మొత్తాన్ని సౌమ్య తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా ఇలాగా తన పెట్స్ తో చిల్ అవుతూ వాటితో మాట్లాడుతూ వాటికి ముద్దులు పెట్టే ఫొటోస్ ని, వీడియోస్ ని చూసాం. ఇప్పుడు సౌమ్య వంతు వచ్చింది. సెలబ్రిటీస్ అంతా కూడా కొంచెం బ్రేక్ దొరికింది అంటే చాలు పెట్స్ తో ఎంజాయ్ చేయడమో, మాల్దీవులకు వెళ్లిపోవడమే చేస్తుంటారు.