English | Telugu

Jayam serial : రిసెప్షన్ లో గంగకి అవమానం.. రుద్ర సూపర్ సపోర్ట్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -127 లో......రుద్ర గంగ పెళ్లి విషయం ఎవరికీ తెలియదు అని పెద్దసారు రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తాడు. రిసెప్షన్ కి పారు వస్తుంది తనని ఎవరు పిలిచారని శకుంతలని పెద్దసారు అడుగుతాడు. నేనే పిలిచానని శకుంతల అంటుంది. అలా ఎందుకు పిలిచావ్ అమ్మ అందరు ఏమనుకుంటారు.. తనతో పెళ్లి ఆగిపోయిందని ప్రీతీ అంటుంది. అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారని శకుంతల అంటుంది. ఆ తర్వాత రుద్ర రెడీ అయి కిందకి వస్తాడు.

ఆ తర్వాత రిసెప్షన్ కి పైడిరాజు, లక్ష్మీ వస్తుంటే సెక్యూరిటీ ఆపుతారు. దాంతో పెద్దసారు వెళ్లి వాళ్ళు మా వియ్యంకులు అని చెప్పి లోపలికి తీసుకొని వస్తాడు. పెళ్లి కూతురు వాళ్ళు బస్తీ వాళ్ళా అని వచ్చినవాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత రుద్ర వాళ్ళని కూర్చోమని చెప్తాడు. రుద్ర నువ్వు డౌన్ టు ఎర్త్ అని తెలుసు కానీ మరి ఇంత డౌన్ అయి పెళ్లి చేసుకుంటావ్ అనుకోలేదని పారు అంటుంది. ఆ తర్వాత గంగ ఓవర్ మేకప్ తో ఎంట్రీ ఇస్తుంది. అలా లేకి దానిలాగ తయారు అయ్యింది ఏంటి.. గొప్పింటి కోడలు అయ్యాను అని పొగరని వచ్చినా వాళ్ళు అనుకుంటారు. ఏంటి ఇలా రెడీ అయ్యావని ప్రీతీ అడుగుతుంది. ఆవిడా రెడీ చేసిందని గంగ అంటుంది. స్నేహ బ్యూటీషియన్ దగ్గరికి వెళ్తుంది కానీ తను ఉండదు.. అదంతా ఇషిక ప్లాన్ అందరు గంగని చూసి నవ్వుకుంటారు.

దాంతో గంగని రుద్ర తీసుకొని పైకి వెళ్తాడు. వెళ్లి చీర కట్టుకొని రా అంటాడు. గంగ చీర చుట్టుకొని వస్తుంది. నాకు కట్టుకోవడం రాదని చెప్పడంతో గంగకి రుద్ర చీర కడుతాడు. అందంగా రెడీ చేసి తీసుకొని వస్తాడు. దాంతో పారు, ఇషిక షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.