English | Telugu

Amardeep Eliminated: అమర్ దీప్ ఎలిమినేటెడ్.. గాయం కారణంగా బయటకు!

ఈ సీజన్-7 లో.. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ల కంటే కంటెస్టెంట్స్ చేస స్ట్రాటజీలు నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి‌. నిన్న మొన్నటి దాకా ఫ్యామీలీ వీక్ లో ఎమోషనల్ ఎపిసోడ్ లుగా మలచడంలో బిగ్ బాస్ ప్రోమోలతో ఆకర్షించగా, కంటెస్టెంట్స్ ఏడ్చేస్తూ సెంటిమెంట్ తో పిండేశారు.

మూడు వారాల క్రితం శివాజీ చేతికి గాయం కారణంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకున్నారంతా కానీ ఇప్పుడు ఆ సిచువేషన్ అమర్ దీప్ కి వచ్చింది. ఎందుకంటే హౌస్ లో జరుగుతున్న టాస్క్ లో అమర్ దీప్ అస్వస్థతకు గురయ్యాడంట. అందుకే అతడిని మెడికల్ రూమ్ కి తీసుకెళ్ళారంట బిగ్ బాస్ యాజమాన్యం. హెల్త్ చెకప్ చేసి సెలైన్ కూడా పెట్టారంట.‌ హౌస్ లో ఇప్పటి వరకు పెట్టిన అన్ని టాస్క్ లలో ఒకటి, రెండు గేమ్ లు మినహా దాదాపు అన్నింట్లో ఫౌల్ గేమ్స్ ఆడాడు. ప్రతీవారం నాగార్జున వార్నింగ్ ఇవ్వడం, ఇకనుండి రిపీట్ కాకుండా చూసుకుంటానని చెప్పడం.. ఇలా ప్రతీవారం జరుగుతుంది. ఫిజికల్ టాస్క్ లు ఆడే అమర్ దీప్ కి మెంటల్ గేమ్స్ ఆడలేడని ఇప్పటికే తేలిపోయింది.

సీరియల్ బ్యాచ్ లో ప్రియాంక, శోభాశెట్టి ఇద్దరు ఏది చెప్తే అదే ఫాలో అవుతూ నెగెటివిటి తెచ్చుకున్న అమర్ దీప్.. ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా వరకు మారాడు. తనే సొంతంగా డెసిషన్ తీసుకుంటున్నాడు. అయితే ప్రతీ టాస్క్ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి డిస్కషన్ చేసుకోవడం, మాట జారడంతో ప్రేక్షకుల దృష్ణిలో నెగెటివ్ అవుతున్నాడు అమర్ దీప్. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం అమర్ దీప్ ఫిజికల్ గా ఏదో ప్రాబ్లమ్ అని తెలిసింది. ఒకవేళ అమర్ దీప్ నిజంగానే ఆడలేని స్థితిలో ఉంటే వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు బిగ్ బాస్. ఎందుకంటే ఇంకా మిగిలింది నాలుగు వారాలే‌. టికెట్ టూ ఫినాలే రేస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మాత్రమే వెళ్తారనే విషయం తెలిసిందే. ఇప్పటిదాకా అమర్ దీప్ టాప్-5 లో ఉంటాడని అనుకున్నారంతా కానీ ఇలా టాస్క్ లో ఓవర్ అగ్రెసివ్ అవుతూ గాయాల పాలవ్వుతున్నాడు అమర్ దీప్. అయితే ఇప్పుడు అమర్ దీప్ ఎలిమినేటెడ్ అంటూ వార్తలు వైరల్ గా మారాయి.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.