English | Telugu

Illu illalu pillalu : ప్రేమ కోసం ధీరజ్ ఆ పని చేయగలడా.. అత్తకు కోడలు భరోసా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -75 లో.... రామరాజుపై ఉన్న కోపంతో చందు లవ్ ఫెయిల్యూర్ అయ్యాడని, అందుకు తాగుతున్నాడని రామరాజుతో చెప్తుంది. దాంతో రామరాజు బాధపడుతూ లోపలకి వెళ్ళిపోతాడు.రాత్రి చందు బాధపడుతుంటే రామరాజు తన దగ్గరికి వెళ్తాడు. ఇంత బాధపడుతున్నావ్.. వాళ్ళలాగా నన్ను మోసం చెయ్యాలి అనిపించలేదా అని రామరాజు అడుగుతాడు. లేదు నాన్న నాకు నా ప్రేమ కంటే మీ ప్రేమ గొప్పదని రామరాజు గురించి గొప్పగా చందు మాట్లాడతాడు. నాకు నువ్వు అందరిలో మాట్లాడే ధైర్యం ఇచ్చావ్ రా.. నువ్వు అసలైన కొడుకు అంటే అని రామరాజు గర్వంగా మాట్లాడతాడు. అదంతా సాగర్, ధీరజ్, వేదవతి లు వింటుంటారు.

అదంతా విని సాగర్, ధీరజ్ లని వేదవతి పక్కకి తీసుకొని వచ్చి.. నేను ముందు నుండే అడుగుతున్నా పెద్దోడు ఎందుకు అలా ఉన్నాడని మీరే చెప్పలేదని కోప్పడుతుంది. అప్పుడే నర్మద వచ్చి.. అత్తయ్య.. వాళ్లకి మీకు చెప్పే దైర్యం లేదు. మీరు బాధపడకండి.. మేమ్ అందరం బావ గారి బాధకు కారణం అయ్యాం కనుక మేమే దగ్గరుండి బావ గారి పెళ్లి జరిపిస్తామని వేదవతికి నర్మద చెప్తుంది. నవ్వండి అత్తయ్య అంటూ నర్మద వేదవతిని నవ్విస్తుంది.

మరొకవైపు ప్రేమ, ధీరజ్ లు ఒకరికొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ప్రేమ నేలపై పడుకుంటూ ఉంటుంది. నీకు నొప్పి ఉంది కదా పైన పడుకోమని అనగానే నువ్వు ఎందుకు అలా అంటున్నావో నాకు తెలుసు.. అందరి ముందు బిల్డప్ ఇచ్చుకోవడానికా అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.